NTV Telugu Site icon

Ram Temple Chariot Burning Case: రాముడి గుడి రథం దహనం కేసు.. 24 గంటల్లో ఛేదించిన పోలీసులు..

Sp Jagadeesh

Sp Jagadeesh

Ram Temple Chariot Burning Case: అనంతపురం జిల్లాలో రథం దహనం కేసు సంచలనం సృష్టించిన విషయం విదితమే కాగా.. ఈ కేసును 24 గంటల్లోనే ఛేదించారు పోలీసులు.. రాయదుర్గం నియోజకవర్గం కనేకల్ మండలం హనకనహాల్ గ్రామంలో నిన్న శ్రీరాముడి గుడికి సంబంధించిన రథానికి నిప్పు పెట్టారు గుర్తు తెలియని వ్యక్తులు.‌ దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు.. అదే గ్రామానికి చెందిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన బొడిమల్ల ఈశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ని అరెస్టు చేశారు.‌ సొంత ఖర్చులతో రామాంజనేయ రెడ్డి అనే వ్యక్తి శ్రీరాముని రథం చేయించారని.. ఆయనకు మంచి పేరు రాకూడదన్న ఉద్దేశంతో ఈశ్వర్ రెడ్డి, ఆయన అనుచరులు రథానికి నిప్పు పెట్టారని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ మీడియాకు వెల్లడించారు.

Read Also: Devara Ticket Prices: ‘దేవర’ టికెట్ ధరలపై ఏపీ హైకోర్టులో పిల్!

అయితే, రామాలయంలో రథం దగ్ధం కేసును సీరియస్‌గా తీసుకుంది ప్రభుత్వం.. ఈ ఘటనపై విచారణ జరపాలని.. వెంటనే నిందితులను అరెస్ట్‌ చేయాలంటూ సీఎం చంద్రబాబు నాయుడు.. జిల్లా కలెక్టర్‌, ఎస్పీలను ఆదేశించిన విషయం విదితమే.. ఈ నేపథ్యంలో ఒకే రోజులో శ్రీరామాలయంలో రథం దహనం కేసును చేధించారు పోలీసులు.. రథం దగ్ధం ఘటనపై మీడియాతో మాట్లాడిన ఎస్పీ జగదీష్.. కనేకల్ మండలం హనకనహాల్ గ్రామంలో రథం దగ్ధం కేసులో ఒకరిని అరెస్టు చేవామని తెలిపారు.. ఈశ్వర్ రెడ్డి అనే వైసీపీ నాయకుడు పెట్రోల్ పోసి.. రథానికి నిప్పటించారని వెల్లడించాఉ.. హనకనహాల్ గ్రామస్తుడు ఎర్రిస్వామి రెడ్డి, అతని అన్నదమ్ములు దాదాపు 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి రథాన్ని తయారు చేశారు.. ఎర్రిస్వామి రెడ్డి సొంత కుటుంబ సభ్యులు.. చందాలు తీసుకోకుండా సొంతంగా రథాన్ని తయారు చేయడంతో గ్రామంలోని మిగిలిన వారితో విభేదాలు ఏర్పడ్డాయి.. ఈ నేపథ్యంలోనే ఈశ్వర్ రెడ్డి మొన్న అర్ధరాత్రి తన బైక్ లో పెట్రోల్ తీసి రథానికి నిప్పంటించాడు.. ఈ కేసులో ఇప్పటి వరకు ఐదుగురిని విచారించాం.. రథం దగ్ధం వెనుక ఎవరున్నారో నిగ్గు తేలుస్తామని తెలిపారు.. ఈశ్వర్ రెడ్డిని కస్టడీకీ తీసుకొని రథం దగ్ధం కేసులో ఇంకా ఎవరి పాత్ర అయినా ఉందా? అని విచారిస్తాం అన్నారు ఎస్పీ జగదీష్‌..