Site icon NTV Telugu

Guntakal MLA Sticker Car: గుంతకల్ ఎమ్మెల్యే అనుచరుల హల్‌చల్.. పోలీసుల అదుపులో ఇద్దరు!

Jayaram

Jayaram

Guntakal MLA Sticker Car: గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేరుతో ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్ వాహనాన్ని ఉపయోగిస్తూ ఇద్దరు వ్యక్తులు నానా హంగామా సృష్టించిన ఘటన అనంతపురం జిల్లాలో తీవ్ర కలకలం రేపుతుంది. మత్తులో ఉన్న వాళ్లు రోడ్డుపై వెళ్తున్న వాహనాలను అడ్డుపెట్టి బెదిరిస్తున్నారని స్థానికులు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. విషయం తెలిసిన పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. మత్తులో ఉన్న రౌడీషీటర్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించిన సమయంలో.. వారు పోలీసులపై కారుతో దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో పెట్రోలింగ్‌లో ఉన్న కానిస్టేబుల్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

Read Also: 400% వాల్యూమ్ బూస్ట్, IP68+IP69 రక్షణ, 120Hz డిస్‌ప్లేతో బడ్జెట్ లో Vivo Y31d లాంచ్.. ధర ఎంతంటే.?

అయితే, పోలీసులు తమ వాహనంతో వెంటాడి, ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారును అడ్డగించారు. కారును తనిఖీ చేయగా, గుత్తికి చెందిన రౌడీషీటర్ అజయ్ తో పాటు మరో వ్యక్తి అందులో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే పేరుతో ఉన్న స్టిక్కర్‌ను దుర్వినియోగం చేసి ప్రజలను భయ పెడుతున్న ఘటనపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఈ సంఘటనపై ఎమ్మెల్యే స్టిక్కర్‌ల దుర్వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.

Exit mobile version