Site icon NTV Telugu

Ananthapuram SP: ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో ఒరిజినల్ కాదు

Ananthapuram Sp

Ananthapuram Sp

Ananthapuram SP Fakirappa: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో ఒరిజినల్ వీడియో కాదని అనంతపురం ఎస్పీ ఫకీరప్ప వెల్లడించారు. ఈ వీడియోను మార్ఫింగ్ లేదా ఎడిటింగ్ చేసి ఉండొచ్చని ఆయన తెలిపారు. ఎక్కువసార్లు షేర్ కావడం వల్ల అసలైందా, నకిలీదా తేల్చడం కష్టమని చెప్పారు. ఒరిజినల్ వీడియో దొరికే వరకు దీన్ని నిర్ధారించలేమన్నారు. తొలుత itdp వాట్సాప్ గ్రూపులో ఈ వీడియోను పోస్ట్ చేశారని ఎస్పీ ఫకీరప్ప పేర్కొన్నారు. యూకే నంబర్‌ నుంచి ఆగస్టు 4న ఈ వీడియో షేర్ అయిందని.. వీడియో చూస్తున్న విజువల్స్‌ను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని వివరించారు. ఈ వీడియోను అప్‌లోడ్ చేసిన వ్యక్తి వివ‌రాల‌ను సేక‌రిస్తున్నామ‌న్నారు.

Read Also: AP ECET Results: ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల.. ఫలితాల్లో అమ్మాయిలదే హవా

ఈ వీడియోపై ఎంపీ గోరంట్ల మాధ‌వ్ ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేశామ‌ని ఎస్పీ ఫకీరప్ప మీడియాకు చెప్పారు. ఒరిజినల్ వీడియో ఉంటేనే ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపగలమని.. అప్పుడు మాత్రమే నివేదిక వస్తుందని తెలిపారు. ఇప్పటివరకు ఎంపీ వీడియోపై బాధితులు ఎవరూ ఫిర్యాదు చేయలేదన్నారు. అటు ఎంపీ వీడియోను చెక్ చేస్తే అసలు విషయం బయటకు వస్తుంది కదా అని జర్నలిస్టులు ప్రశ్నించగా.. బాధితులెవరైనా ఫిర్యాదు చేస్తేనే ఎంపీ మొబైల్ చెక్ చేస్తామని అనంతపురం ఎస్పీ ఫకీరప్ప వెల్లడించారు.

Exit mobile version