NTV Telugu Site icon

Complaints in WhatsApp: పోలీసుల అరుదైన రికార్డు.. ఎఫ్‌ఐఆర్‌ లేకుండానే 3 వేల కేసులు ఛేదించారు..!

Sp Fakirappa

Sp Fakirappa

అనంతపురం జిల్లా పోలీసులు మరో అరుదైన రికార్డ్ సాధించారు. ఎలాంటి ఎఫ్ఐఆర్ లేకుండా కేవలం వాట్సప్ ఫిర్యాదుతో ఏకంగా 3 వేల సెల్ ఫోన్లు రికవరీ చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అనంతపురం జిల్లా పోలీసులు ఒక వినూత్న సర్వీస్ కు శ్రీకారం చుట్టారు. చోరీకి గురైన ఫోన్లు, లేదా పొగుట్టుకున్న ఫోన్ల కోసం చాలా మంది బాధితులు పోలీస్‌ స్టేషన్ల చుట్టూ తిరిగేవారు. ఫిర్యాదు చేసినా అవి ట్రేస్ కాక ఇబ్బంది పడే వారు. ఇలాంటి వాటిని గమనించిన జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప.. ఈ ఏడాది మార్చి 17న వాట్సప్ ఫిర్యాదుతో సెల్ ఫోన్ల రికవరీ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. దీనికి మంచి స్పందన రావడంతో.. సెల్ ఫోన్లు భారీగా రికవరీ కావడంతో జూన్ 26న చాట్ బాట్ సేవలు తీసుకొచ్చారు. దీనిపై ఇప్పటి వరకు 5 కోట్లు విలువ చేసే 3 వేల ఫోన్లు రికవరీ చేశారు.

Read Also: CM KCR Suffering From Fever: సీఎం కేసీఆర్‌కు జ్వరం.. మరో నాలుగు రోజులు ఢిల్లీలోనే..!

ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు నుంచి సుమారు 6,856 ఫిర్యాదుల వరకు వచ్చాయి. వీటిలో 3007 మొబైల్ ఫోన్లు రికవరీ చేశారు. ఏపీలోని శ్రీకాకుళం వంటి మారు మూల ప్రాంతంతో పాటు ఉత్తరప్రదేశ్, గోవా వంటి 13 రాష్ట్రాల నుంచి ఫిర్యాదులు అందినట్టు జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప వెల్లడించారు.. మొబైల్ ఫోన్లు అన్నవి ఇటీవల కాలంలో కేవలం ఒక వస్తువు మాత్రమే కాదని.. శరీరంలో ఒక భాగంగా మారిపోయాయని.. అలాగే సెంటిమెంట్ తో కూడుకున్నదిగి మారిందని జిల్లా ఎస్పీ అన్నారు. ఇక, పోయిన ఫోన్లు తిరిగి ఇవ్వడంపై బాధితులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారని.. అలాగే ఇది మిగిలిన జిల్లాల వారు కూడా ఆదర్శంగా తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు… మొత్తంగా.. ఫిర్యాదు చేసినా.. స్పందిస్తారో లేదో అనే అనుమానాల నుంచి.. కేవలం వాట్సప్‌ ఫిర్యాదుతోనే కేసులు ఛేదించి ఔరా! అనిపిస్తున్నారు అనంతరంపురం పోలీసులు.