Anantapur Farmers: విషాదం.. విద్యుత్ తీగలు తెగపడి నలుగురు కూలీలు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anantapur Farmers Died Because Of Eletric Wires: అనంతపురంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. విద్యుత్ తీగలు తెగిపడి నలుగురు వ్యవసాయ కూలీలు దుర్మరణం చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స కోసం ఆ ఇద్దరికి బళ్లారి ఆసుపత్రికి తరలించారు. బొమ్మనహాళ్ మండలం దర్గాహొన్నూరులో కొందరు వ్యవసాయ కూలీలు ఆముదం పంట కోయడానికి ట్రాక్టర్‌లో వెళ్లారు. పంట కోస్తున్న సమయంలో వర్షం పడింది. దీంతో.. ఇంటికి తిరిగి వెళ్దామని కూలీలు భావించారు. ఇంతలోనే విద్యుత్ మెయిన్ లైన్ తీగలు హఠాత్తుగా తెగబడ్డాయి. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన వారికి గాయాలయ్యాయి. మృతి చెందిన వ్యవసాయ కూలీలు పేర్లు.. పార్వతీ, సక్రమ్మ, రత్నమ్మ, వండ్రక్క. ఘటన స్థలం.. మృతుల బంధువుల రోదనలతో శోకసంద్రంలా మారింది. పని కోసం వెళ్లిన తమ వారు.. ఇలా విగతజీవులుగా మారడాన్ని చూసి తట్టుకోలేక కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మరోవైపు.. బాధితులతో పాటు గ్రామస్తులు కూడా విద్యుత్ అధికారులపై మండిపడుతున్నారు. దర్గాహోన్నూరు సమీపంలో విద్యుత్ తీగలు ఎప్పటినుంచో వేలాడుతున్నాయని, విద్యుత్ అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ దారుణం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
Also Read
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!