NTV Telugu Site icon

ఈ వెబ్‌సైట్ ద్వారా ఆనంద‌య్య మందు పంపిణీ..

Anandayya Medicine

ఏపీ ప్ర‌భుత్వం నుంచి గ్రీన్ సిగ్న‌ల్ రావ‌డంతో.. మ‌ళ్లీ మందు పంపిణీ ఏర్పాట్ల‌లో మునిగిపోయారు నెల్లూరు జిల్లా కృష్ణ‌ప‌ట్నానికి చెందిన ఆనంద‌య్య‌.. అయితే, మందు కోసం ఇత‌ర ప్రాంతాల నుంచి ఎవ‌రూ కృష్ణ‌ప‌ట్నానికి రావొద్దు అని ఇప్ప‌టికే విజ్ఞ‌ప్తి చేశారు… జిల్లాకు 5 వేల చొప్పున మందులు పంపుతామ‌ని.. అధికారులు వాటిని పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నార‌ని తెలిపారు. మ‌రి ఆనంద‌య్య మందు పంపిణీ ఎప్ప‌టి నుంచి అని అంతా ఎదురుచూస్తోన్న స‌మ‌యంలో.. సోమవారం నుండి అందుబాటులోకి తెస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.. అయితే, ఆ మందు కోసం వెబ్‌సైట్‌లో రిజిస్ట్ర‌ర్ చేసుకోవాల్సి ఉంటుంది.. దీని కోసం.. www.childeal.in పేరుతో వెబ్‌సైట్ రూపొందించారు.. ఆ వెబ్‌సైట్ పేరును అధికారికంగా ప్ర‌క‌టించింది నెల్లూరు జిల్లా అధికార యంత్రాంగం.. ఇక‌, వెబ్‌సైట్ నిర్వ‌హ‌ణ‌లో ఆనంద‌య్య అనుచ‌రులు నిమ‌గ్న‌మ‌య్యారు.. సైట్‌లో కస్టమర్ దరఖాస్తు చేసుకుంటే… కొరియర్ ద్వారా మందు పంపిణీ చేసేందుకు ఆనందయ్య టీం సిద్ధ‌మ‌వుతోంది.. మందు తయారీ సమయంలో భద్రత , పంపిణీకి సహకరించాలని కలెక్టర్ ని కోరారు ఆనంద‌య్య‌. ఇక‌, సోమ‌వారం నుంచి మందు పంపిణీ ప్రారంభం కానుకండ‌గా.. మ‌రి ఆన్‌లైన్‌లో ఆనంద‌య్య మందుకు ఎంత‌టి డిమాండ్ ఉంటుందో చూడాలి.