Site icon NTV Telugu

Anakapalli Blast: అనకాపల్లిలో నేడు రెండు మృతదేహాలకు పోస్టుమార్టం

Anakapalli

Anakapalli

Anakapalli Blast: అనకాపల్లి జిల్లాలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటం సంభవించడంతో సుమారు 8 మంది కార్మికులు మృతి చెందగా, మరో 8 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఇక, మరో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ కేజీహెచ్ లో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మరో ముగ్గురిని నర్సీపట్నం ప్రభుత్వ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.

Read Also: Waqf Act: బెంగాల్ దారిలో కర్ణాటక.. వక్ఫ్ చట్టంపై కాంగ్రెస్ ప్రభుత్వం..

అయితే, నర్సీపట్నంలో 6 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి అయింది. ఇక, అనకాపల్లిలో నేడు మరో రెండు మృతదేహాలకు పోస్టుమార్టం జరగనుంది. బాణాసంచా తయారీ కేంద్రం పేలుడు ఘటనపై కోటవురట్ల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. ఈ ఘటనపై దర్యాప్తుకు ఆరు బృందాల ఏర్పాటు చేశారు. పేలుడు సంభవించిన ఘటనా స్థలంలో ఫోరెన్సిక్ టీం ఆధారాలు సేకరిస్తుంది.

Read Also: Prashanth Neel : KGF – 3లో తమిళ స్టార్ హీరో..?

ఇక, కేజీహెచ్ లో చికిత్స పొందుతున్నవారు
1.మడగల జానకిరామ్ (కైలాస పట్నం )..
2. సియాద్రి గోవింద్, కైలాస పట్నం..
3. వేలంగి శేష రాణి, సామర్లకోట..
4. జల్లూరు నాగరాజు, రట్నాల పాలెం..
5. వేలంగి సంతోషి, సామర్లకోట

నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారు…
1. గుంపెన సూరిబాబు, కైలాస పట్నం
2. ఎస్ శ్రీను కైలాస పట్నం
3. వేలంగి రాజు సామర్లకోట

Exit mobile version