Botsa Satyanarayana: అనకాపల్లి జిల్లాలోని చోడవరంలో గల షుగర్ ఫ్యాక్టరీ రైతులతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా చెరుకు రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు వైసీపీ నేతలు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, బుడి ముత్యాల నాయుడు, కరణం ధర్మశ్రీ, అదీప్ రాజ్. ఇక, వైఎస్ఆర్సీపీ నేతల ముందు తమ కష్టాలను రైతులు వినిపించారు. కాగా, మాజీ మంత్రి, వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతుల కోసం వైఎస్సార్ సీపీ నిరసన దీక్ష చేస్తామన్నారు. శాసన మండలలో రైతుల సమస్యలను లేవనెత్తుతాం.. రైతుల బకాయిలను ఆణా పైసాతో సహా చెల్లించాలని డిమాండ్ ఆయన డిమాండ్ చేశారు. గోవాడ సుగర్ ఫ్యాక్టరీ పరిధిలో లక్ష 70 వేల టన్నుల చెరకు పండింది.. ఇప్పటి వరకు కనీసం 70 టన్నుల చెరకు కూడా క్రస్సింగ్ చేయలేదు అని ఆరోపించారు. షుగర్ ఫ్యాక్టరీ వ్యవహారంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది అని బొత్స అన్నారు.
Read Also: Posani Krishnamurali: పోసాని కృష్ణ మురళి కస్టడీ పిటిషన్ డిస్మిస్
అయితే, ఇప్పటి వరకు రైతులకు బకాయిలు చెల్లించలేదు అని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రతి ఏడాది నవంబర్, డిసెంబర్ నెలలో క్రసింగ్ జరిగేది.. కానీ, ఇప్పుడు సంక్రాంతి దాటిన క్రసింగ్ జరగలేదన్నారు. జనవరిలో క్రాసింగ్ జరగడం వలన చెరుకు ఎండిపోతుంది.. షుగర్ ఫ్యాక్టరీ రైతులకు వైఎస్ జగన్ ప్రభుత్వంలో 90 కోట్ల రూపాయలతో ఆదుకున్నారు.. షుగర్ ఫ్యాక్టరీ కష్టాల నుంచి తక్షణం గట్టెక్కాలంటే రూ. 35 కోట్లు అవసరం అని చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వం వెంటనే 35 కోట్ల రూపాయలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు జీతాలు వెంటనే చెల్లించాలి.. టన్ను చెరుకుకు 2500 ఇస్తే ఏమి సరిపోతుంది.. ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం కాదు రైతులను ఆదుకోవాలి.. రాజకీయాల కోసం నేను రాలేదు.. రైతుల బాధలు చూసి మాట్లాడుతున్నాను అని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.