Home Minister Vangalapudi Anitha: పాయకరావుపేట బీసీ బాలికల కాలేజ్ హాస్టల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సమయంలో ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనితకు ఊహించని ఘటన ఎదురైంది.. హాస్టల్‌లో బాలికలతో కలిసి భోజనం చేస్తుండగా.. ఆమె తన ఫ్లేట్ వైపు చూసి.. కొంత ఆశ్చర్యానికి గురయ్యారు.. దీంతో, విద్యార్థులు అంతా నవ్వారు.. అయితే, ఇక్కడే హోంమంత్రి అనిత భోజనం చేస్తుండా.. ఆమె భోజనంలో బొద్దింక వచ్చిందనే ప్రచారం జరిగింది.. ఆ వార్తలపై ఈ రోజు క్లారిటీ ఇచ్చారు హోం మంత్రి అనిత..
Read Also: Tamilnadu: ‘‘ అధికార మత్తు.. రాష్ట్రమే సొంత పౌరుడిని చంపింది’’.. లాకప్ డెత్‌పై హైకోర్టు ఆగ్రహం..
సోమవారం రోజు తాను పాయకరావుపేట బీసీ బాలికల కాలేజీ హాస్టల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశానని తెలిపిన అనిత.. విద్యార్థులకు మంచి వసతలు కల్పించడమే ఎన్డీయే ప్రభుత్వ లక్ష్యం అన్నారు.. పాయకరావుపేట హాస్టల్ లో మెనూ పాటించలేదు. వార్డెన్ అందుబాటులో లేరు.. హాస్టల్ లో సెక్యూరిటీ కూడా లేరు.. దీంతో, వార్డెన్ ను సస్పెండ్ చేశామని తెలిపారు.. అన్ని హాస్టల్స్ ను తనీఖీలు చేయమని అధికారులను ఆదేశించామన్నారు.. అయితే, మంచిని కూడా చెడులాగ వైసీపీ వాళ్లు ప్రచారం చేస్తున్నారు.. వైసీపీ అఫిషియల్ ఫేజ్ లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.. భోజనంలో చిన్న తల వెంట్రుక కనిపించింది అన్నారు..
Read Also: Tamilnadu: ‘‘ అధికార మత్తు.. రాష్ట్రమే సొంత పౌరుడిని చంపింది’’.. లాకప్ డెత్‌పై హైకోర్టు ఆగ్రహం..
మరోవైపు, గత ఐదు సంవత్సరాల్లో ఒక ఎమ్మెల్యే అయినా హాస్టల్స్ కు వెళ్ళరా? అని నిలదీశారు మంత్రి అనిత.. శ్రీశైలం ప్రసాదంలో బొద్ధింక అని నిన్న ప్రచారం చేశారు. ఈ రోజు భోజనంలో బొద్దింక అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. ఎదో రకంగా బురద జల్లాలని చూస్తున్నారని మండిపడ్డారు.. మేం చిత్తశుధ్ధితో ఉన్నాం.. ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్నాం.. ఒక సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా తొలి అడుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు.. అసలు వైసీపీ వాళ్ళకు మానవత్వం ఉండదా? అధికారంలోకి రావాలి.. సీఎం కుర్చీలో కూర్చోవాలనే ఆలోచన తప్ప అని దుయ్యబట్టారు హోం మంత్రి వంగలపూడి అనిత..
