Site icon NTV Telugu

Dadi Veerabhadra Rao: మాజీ మంత్రి తీవ్ర వ్యాఖ్యలు.. వారిని ఉరితీసినా తప్పులేదు..

Dadi Veerabhadra Rao

Dadi Veerabhadra Rao

Dadi Veerabhadra Rao: అనకాపల్లి జిల్లా అనకాపల్లిలో జరిగిన తెలుగుదేశం పార్టీ మినీ మహానాడులో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత దాడి వీరభద్రరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. అనకాపల్లి జిల్లా యంత్రాంగంపై విరుచుకుపడ్డ ఆయన.. అనకాపల్లి జిల్లా అవినీతి యంత్రాంగాన్ని ఉరి తీసినా తప్పులేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. జిల్లా అధికారులు ప్రతిపక్ష పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని.. టీడీపీ నాయకులు ఎన్నిసార్లు అధికారులు చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదన్నారు.. ఇలా అయితే జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఉంటుందా..? అని ప్రశ్నించారు. మాజీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి కుమారుడు కొద్దిరోజుల క్రితం అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూర్చొని తన పనులు చేయించుకున్నాడు అని ఆరోపించారు.. జవహర్ రెడ్డి కుమారుడు వద్దకు జిల్లా అధికారులు పరుగులు పెట్టుకొని వెళ్లి పని చేస్తున్నారని దుయ్యబట్టారు..

Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

ఇక, గత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంలో కుంభకోణాలు, అక్రమాలకు పాల్పడిన అధికారులే జిల్లాలో ఇప్పుడు కీలక పోస్టులలో పనిచేస్తున్నారని విమర్శించారు దాడి వీరభద్రరావు.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బదిలీలు జరిగినా.. అనకాపల్లి జిల్లాలో మాత్రం బదిలీలు జరగలేదన్నారు.. టీడీపీ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబును బ్రష్టు పట్టించవద్దని జిల్లా అధికారులను వేడుకుంటున్నాను.. ఇకనైనా పద్దతి మార్చుకోండి అని వార్నింగ్‌ ఇచ్చారు టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు..

Exit mobile version