NTV Telugu Site icon

Speaker Ayyanna Patrudu: ఏరియా ఆస్పత్రే నా మానస పుత్రిక.. స్పీకర్‌ భావోద్వేగం

Speaker

Speaker

Speaker Ayyanna Patrudu: అనకాపల్లి ఏరియా ఆస్పత్రే నా మానస పుత్రిక.. దీనిని చెడగొట్టేందుకు ప్రయత్నం చేస్తే సహించేది లేదంటూ వార్నింగ్‌ ఇచ్చారు స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు.. కలెక్టర్ విజయకృష్ణన్ ఆధ్వర్యంలో ఏరియా ఆస్పత్రిలో నిర్వహించిన సమీక్ష మాట్లాడిన ఆయన.. భావోద్వేగానికి గురయ్యారు.. రోగులకు సేవ చేయడం వైద్యులకు దేవుడి ఇచ్చిన వరం, దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలి.. తన హాయాంలో చేపట్టిన పనులంటూ లిఫ్ట్‌, బ్లడ్ బ్యాంక్, ఆర్ధోపెడిక్ ఎక్స్ రే, డయాలసిస్ యూనిట్ పై కలెక్టరుకు వివరించిన అయ్యన్న.. అయితే, ఐదు సంవత్సరాల కాలంలో 6 వేల ప్రెగ్నెన్సీ కేసులను బయటకు పంపించారు..? కారణం ఏమిటి? అంటూ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను ప్రశ్నించారు స్పీకర్ అయ్యన్న.. కొత్త ఎమ్మెల్యే అధికారంలోకి వచ్చి మూడు నెలలు అయినా కమిటీ ఎందుకు వేయలేదు? అని నిలదీశారు.. ఇక్కడ నుంచి రోగులను ప్రైవేటు ఆస్పత్రులకు ఎందుకు పంపుతున్నారు? అని మండిపడ్డారు.

Read Also: Delhi: జమిలి ఎన్నికలపై రామ్‌నాథ్ కోవింద్ నివేదికకు కేంద్ర కేబినెట్ ఆమోదం

పేషెంట్ల నుంచి కిందస్థాయి సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్న ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అని సూపరింటెండెంట్‌ను నిలదీశారు స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు.. లిఫ్ట్‌, సోలార్ ద్వారా విద్యుత్ సరఫరాను ఎందుకు వినియోగించ లేదు..? ఎందుకు వాటి నిర్వహణను చేయడం లేదు? ఆయుష్ విభాగం మంజూరై ఐదేళ్లయినా ఇంతవరకు ఎందుకు ప్రారంభించలేదు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.. ఇక, మరో వాటర్ ప్లాంట్ తో పాటు శస్త్రచికిత్సకు అవసరమైన పరికరాలు ఇచ్చేందుకు హామీ ఇచ్చారు స్పీకర్‌.. ప్రైవేటు అంబులెన్స్ లకు ప్రత్యేక ధరను నిర్ణయించాలి సూచించారు అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు..