ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మైనారిటీలను ఆదుకుంద వైఎస్సార్ అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ ఆత్మీయ అభినందన సభ జరిగింది. ఈ సభకు విచ్చేసిన డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మైనార్టీల గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి వైఎస్సార్ అని కొనియాడారు.
మైనార్టీలకు పొలిటికల్ ఎంపవర్ మెంట్ ఇచ్చిన వ్యక్తి సీఎం జగన్. డిప్యూటీ సీఎం నుంచి కార్పొరేటర్ల వరకూ పదవులిచ్చిన గొప్ప నేత జగన్. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ మైనార్టీలకు ఇంతటి గుర్తింపు లేదన్నారు. విజయవాడలో హజ్ యాత్రికుల కోసం ఎంబారికేషన్ పాయింట్ ఏర్పాటు చేస్తాం. మైనార్టీల కోసం సబ్ ప్లాన్ రూపొందించిన ఏకైక రాష్ట్రం ఏపీ మాత్రమే అన్నారు. ఉర్ధూని సెకండ్ లాంగ్వేజ్ గా గుర్తించినందుకు కృతజ్ఞతలు. మరో ముప్పై ఏళ్లు సీఎంగా జగనే ఉండాలని అంజాద్ బాషా ఆకాంక్షించారు.
సినీ నటుడు అలీ మాట్లాడుతూ …ఏపీలో ముస్లింలకు సీఎం జగన్ అన్ని రకాలుగా గుర్తింపునిస్తున్నారు. హజ్ యాత్రికులకు సాయం చేయడం సంతోషంగా ఉంది. నాంపల్లిలో హజ్ యాత్రికులకు హజ్ హౌస్ ఉంది.ఏపీలో కూడా ఇదే తరహాలో హజ్ హౌస్ త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నా. ఏపీ హజ్ కమిటీ ఛైర్మన్ అజాం మాట్లాడుతూ రాబోయే రెండు నెలల్లో హజ్ యాత్రలు ప్రారంభం కానున్నాయి. హజ్ యాత్ర ప్రాముఖ్యతను తెలియజేసేందుకు ఈ ఆత్మీయ సభ ఏర్పాటుచేశామన్నారు. హజ్ హౌస్ ఏర్పాటు అంశం పై సీఎంను కలుస్తాం అని ఆయన అన్నారు.