Site icon NTV Telugu

Chirla Jaggireddy: అవినీతి గిన్నిస్ బుక్‌లో వారి పేర్లు కచ్చితంగా ఉంటాయి..!

Chirla Jaggireddy

Chirla Jaggireddy

Chirla Jaggireddy: అవినీతిలో రెండవ స్థానంలో ఉన్న బండారు సత్యానందరావు మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి.. కొత్తపేట నియోజకవర్గం పరిధిలో బండారు సత్యానందరావు, బండారు శ్రీనివాస్ కలిసి పెట్టిన అవినీతి పిరమిడ్ ఇసుక కొండలు చూస్తే ఎవరు అవినీతి చేస్తున్నారన్నది ప్రజలకి తెలుస్తుందని ఆరోపించారు. బండారు బ్రదర్స్ అవినీతిని రుజువు చేయడానికి నేను సిద్ధం ఉన్నానని, అవినీతికి పాల్పడలేదని వాడపల్లి వెంకటేశ్వర ఆలయంలో ప్రమాణం చేసి చెప్పగలరా? అంటూ జగ్గిరెడ్డి సవాల్ చేశారు. బెల్ట్ షాపుల్లో మీరు వసూలు చేసే బీటాక్స్ గురించి ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారని విమర్శించారు.

Read Also: PM Modi: విజయ్ రూపానీ కుటుంబాన్ని పరామర్శించనున్న మోడీ

రావులపాలెంలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి.. అవినీతి గిన్నిస్ బుక్ లో బండారు బ్రదర్స్ పేర్లు కచ్చితంగా ఉంటాయని వ్యాఖ్యానించారు. 8వ వింతగా కొత్తపేట నియోజకవర్గంలో బండారు బ్రదర్స్ పెట్టిన పిరమిడ్ ఇసుక కొండలకు కచ్చితంగా పేరు వస్తుందని అన్నారు. బండారు బ్రదర్స్ లో బ్రహ్మానందం ఎవరో.. అలీ ఎవరో మీరే చెప్పాలని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో ప్రజలపై జరిగిన అక్రమాలకు అన్యాయాలకు మీరు నిన్న విజయోత్సవ ర్యాలీ జరుపుకున్నారా? అంటూ ఎద్దేవా చేశారు.. వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన అమ్మఒడిగాని, చేయూతగాని, కాపు నేస్తం గాని, చంద్రబాబు ఇస్తే మీరు ఏ పండగ అయినా చేసుకోండి పర్వాలేదు అన్నారు. కానీ, చంద్రబాబు నాయుడు తల్లికి వందనం పథకం గురించి రాష్ట్ర ప్రజలను మళ్లీ మోసం చేస్తున్నారని ఆరోపించారు అంబేద్కర్ కోనసీమ జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి..

Exit mobile version