Katrenikona MPP Election: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కాట్రేనికోన ఎంపీపీ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. వైసీపీ ఎంపీటీసీలు సామాజిక వర్గాలుగా విడిపోయారు. ఇప్పటి వరకు ఎంపీపీగా మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన లక్ష్మీ ఉండగా.. ఈ సారి తమ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలని శెట్టి బలిజ సామాజిక వర్గం నేతలు కోరుతున్నారు. అయితే, మరోసారి మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన సత్యవతిని ఎంపీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ప్రకటించారు.
Read Also: Flight On Tirumala: మరోసారి తిరుమల శ్రీవారి గోపురంపై నుంచి వెళ్లిన విమానం.. టీటీడీ ఆగ్రహం
ఇక, రెండోసారి కూడా మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ తన సామాజిక వర్గానికి ఎంపీపీ పదవి ఎలా కట్టబెడతారని శెట్టి బలిజ ఎంపీటీసీలు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. తాము కూడా ఎంపీపీ అభ్యర్థిని బరిలో దింపుతామని ప్రకటన విడుదల చేశారు. పొన్నాడలా మాకు కూడా కుల గజ్జి ఉండి ఉంటే సతీష్ రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఉండేవాడా అని శెట్టి బలిజ ఎంపీటీసీలు ప్రశ్నిస్తున్నారు. ఇక, ఈ ఎన్నికకు దూరంగా ఉండి టీడీపీ ఎమ్మెల్యే సుబ్బరాజు రాజకీయం నడిపిస్తున్నారు.