NTV Telugu Site icon

AP Crime: వీడిన యువకుడి హత్య కేసు మిస్టరీ… ప్రియురాలి పనే..!

Crime

Crime

AP Crime: డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కిపురం మండలంలో ఈ నెల 10వ తేదీన జరిగిన యువకుడి హత్య కేసును ఛేదించారు పోలీసులు.. ప్రియుడి హత్య వెనుక ప్రియురాలు ఉన్నట్టుగా గుర్తించారు.. ఈ ఘటనపై మీడియాతో మాట్లాడిన రాజోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ గోవిందరాజు.. మలికిపురం గ్రామానికి చెందిన పడమటి నోయల్ జార్జ్.. గుడిమెల్లంక గ్రామానికి చెందిన రాపాక ప్రశాంతి (భర్తను వదిలేసిన వివాహిత) ప్రేమలో పడ్డాడని.. దీంతో.. గత కొంతకాలంగా పెళ్లి కాకుండానే ఇద్దరూ సహజీవనం చేశారని తెలిపారు.. అయితే, గంజాయి మత్తు పదార్థాలకు బానిసైన నోయల్ జార్జ్.. తనను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నాడని తన అన్న రాపాక ప్రకాష్ కు ప్రశాంతి చెప్పిందని వెల్లడించారు.

Read Also: Nani: NTVతో కలిసి డ్రగ్స్ పట్ల అవగాహన కల్పించిన నేచురల్‌స్టార్‌..

అయితే, కాకినాడలో ఉంటున్న నోయల్ జార్జిని పథకం ప్రకారం ప్రశాంతి తో ఫోన్ చేయించి ప్రకాష్ దిండికి రప్పించాడు..రాపాక ప్రశాంతి, తన అన్న ప్రకాష్, స్నేహితుడు ఎర్రంశెట్టి ప్రేమ్ కుమార్ ముగ్గురు కలిసి నోయల్ జార్జ్ పై ఇనుప రాడ్లతో దాడి చేసే ప్రయత్నం చేశారు.. వీరి నుండి తప్పించుకుని పారిపోయే సమయంలో తన తండ్రికి ఫోన్ చేసి నేను ప్రమాదంలో ఉన్నాను అని చెప్పి ఫోన్ కట్ చేశాడు మృతుడు జార్జ్.. కానీ, పారిపోతున్న నోయల్ జార్జిని పట్టుకుని ఇనుప రాడ్లతో కొట్టి ప్రాణం ఉండగానే దిండి బ్రిడ్జిపై నుండి గోదావరిలో విసిరేసి ఆత్మహత్యగా చిత్రీకరించేలా చెప్పులు, మోటార్ సైకిల్ బ్రిడ్జిపై ఉంచి.. అక్కడి నుంచి ముగ్గురు నిందితులు పారిపోయారు అని తెలిపారు. ఈ నెల 10వ తేదీన నోయల్ జార్జి తండ్రి రత్న రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసుగా మొదట నమోదు చేశాం.. ఈ నెల 13 న అంతర్వేది పల్లిపాలెం వద్ద సముద్రం తీరాన లభ్యమైన నోయల్ జార్జ్ మృతదేహహంపై ఉన్న గాయాలతో సూసైడ్ కాదని ప్లాన్ ప్రకారం చేసిన మర్డర్ అని నిర్ధారణ చేసి కేసు నమోదు శాం.. హత్యకు కారణమైన నిందితులను రిమాండ్ కి తరలింవామని సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌ గోవిందరాజు పేర్కొన్నారు.