NTV Telugu Site icon

Firecrackers Explosion: ఇంట్లో బాణాసంచా తయారీ.. భారీ పేలుడుతో కుప్పకూలిన ఇల్లు..

Firecrackers Explosion

Firecrackers Explosion

Firecrackers Explosion: అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఘోర ప్రమాదం జరిగింది.. రావులచెరువులో ఓ ఇంట్లో బాణా సంచా తయారు ‌చేస్తుండగా పేలుడు సంభవిచింది.. అప్పటికే నిల్వ చేసిన బాణాసంచా ఓవైపు.. తయారీ చేస్తున్న టపాసులు మరోవైపు ఉండడంతో.. జరిగిన ఈ ప్రమాదంలో పెట్ట నష్టం జరిగింది.. ఈ ఘటనలో 14 మందికి తీవ్ర గాయాలు అయినట్టుగా తెలుస్తోంది.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అమలాపురం పట్టణంలోని ఓ ఇంటిలో నిలువ చేసిన బాణాసంచా పేలిపోయి ఇల్లు కుప్పకూలింది.. ఇంట్లో ఆ సమయంలో 14 మంది ఉండగా.. అందరికీ గాయలయ్యాయని చెబుతున్నారు.. అందులో ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.. దీంతో.. క్షతగాత్రులను అమలాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు.. బాణాసంచా పేలుడు ధాటికి రెండు అంతస్తుల భవనం తునాతునకలు అయ్యింది.. ఇంట్లో దీపావళి మందు గుండు సామాగ్రి తయారీతో ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.. ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్న స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు.. అమలాపురం పట్టణ పోలీసులు.. అయితే, పేలుడు దాటికి ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు స్థానికులు.. భయంతో పరుగులు పెట్టారు..

Read Also: Ponnam Prabhakar: రాజీవ్ గాంధీ విగ్రహం కూలగొడతామంటే చూస్తూ ఊరుకోము..,

Show comments