AP Crime: ఆంధ్రప్రదేశ్‌లో మరో విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రామచంద్రపురంలో 5వ తరగతి విద్యార్థిని మృతి చెందింది.. స్థానిక భాష్యం పబ్లిక్ స్కూల్‌లో చదువుతున్న ఐదో తరగతి విద్యార్థిని రంజిత (10) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందింది. ఈ ఘటన రామచంద్రపురంలో తీవ్ర విషాదాన్ని నింపింది.. రంజిత తన గదిలో ఉరివేసుకున్నట్టు తల్లిదండ్రులకు సమాచారం అందినప్పటికీ, తల్లి సునీత మాత్రం ఇది ఆత్మహత్య కాదని, ఎవరో చంపి ఫ్యాన్‌కి వేలాడదీశారని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.
Read Also: Road Accident: బీదర్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ వాసులు మృతి..
మా అమ్మాయి అంత చిన్నది.. ఆత్మహత్య చేసుకునేంత వయసు లేదు.. అంతకుముందే నాతో మాట్లాడింది.. ఆ తర్వాత ఇలా ఎలా?” అని కన్నీరుమున్నీరు అవుతూ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తల్లి సునీత, “స్కూల్‌లో సీసీ కెమెరాలు పరిశీలించాలి. పూర్తి స్థాయి విచారణ జరపాలి,” అని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగరీత్యా ముంబైలో ఉన్న రంజిత తండ్రికి సమాచారం అందించగా, ఆయన త్వరలో స్వగ్రామానికి చేరుకోనున్నారు. బాలిక మృతి వెనుక అసలు కారణాలు వెలుగులోకి రావాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
కాగా, రంజిత చదువులో చురుకుగా ఉండేదని, ప్రతిరోజు మాదిరిగానే నిన్న కూడా క్లాస్‌లో హాజరైందని టీచర్లు తెలిపారు. “ఆమె చాలా యాక్టివ్‌గా ఉండేది, ఆటో వెళ్లే వరకు స్కూల్‌లోనే ఉంది. ఎలాంటి ఇబ్బంది ఉందని ఏమీ చెప్పలేదు,” అని ఒక టీచర్ చెప్పారు. రంజిత మృతిపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి, సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించాలని తల్లి సునీత డిమాండ్ చేశారు. రంజిత తండ్రి ఉద్యోగరీత్యా ముంబైలో ఉంటున్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
