BR Ambedkar Konaseema District: సంక్రాంతి సంబరాలు ముగిసాయి.. సొంత ఊరికి బైబై చెప్పే… ఉద్యోం, ఉపాధి ప్రాంతానికి బయల్దేరి వెళ్లారు చాలా మంది.. మరికొన్ని చోట్ల ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలు సాగుతూనే ఉన్నాయి.. ఇక, అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో సంక్రాంతి సందర్భంగా సీఆర్‌సీ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో యువకుల మధ్య మాట మాట వచ్చి చిన్న వివాదం చోటు చేసుకుంది.. అది కాస్తా తీవ్ర ఘర్షణకు దారి తీసింది.. పార్కు వద్ద సంక్రాంతి సందర్భంగా వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యువకులు పాల్గొన్నారు. అయితే ఒక చిన్న వివాదం చిలికి చిలికి గాలివానగా మారి చివరకు. రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణగా దారితీసింది. దీంతో రెండు సామాజిక వర్గాలు ఇక్కడ ఉన్న కుర్చీలను ఒకరికొకరు విసురుకోవటంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారిపోయింది.. వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలు కాగా ఒక యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఇతన్ని స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Read Also: CM Chandrababu: టీడీపీ మంత్రులతో చంద్రబాబు ప్రత్యేక భేటీ..