Site icon NTV Telugu

Minister Subhash: జగన్ మానసిక స్థితి సరిగా లేదు.. లండన్ వెళ్లి వైద్యం చేయించుకున్నారు..!

Minister Subhash

Minister Subhash

Minister Subhash: వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిపై హాట్‌ కామెంట్లు చేశారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్.. వైఎస్‌ జగన్ మానసిక స్థితి బాగాలేదని ప్రజలు గమనించారని.. అందుకోసమే లండన్ వెళ్లి వైద్యం చేయించుకున్నారని.. అది సెట్ అవ్వని పరిస్థితిలో రాష్ట్ర అభివృద్ధిని చూసి మరింత మానసిక శోభకు గురైతే ప్రభుత్వం తరఫున అన్ని విదాల ఆయనకు సహకరిస్తూ మంచి ఆసుపత్రిలో వైద్యం చేయిస్తాంమని సెటైర్లు వేశారు కార్మిక శాఖ మంత్రి సుభాష్.. ఇక, మాజీ ముఖ్యమంత్రి జగన్ తనని విమర్శిస్తే స్వీకరించలేడు.. విమర్శించడం ఇష్టం.. కానీ, విమర్శిస్తే స్వీకరించలేడు.. రాజకీయ నాయకుడుగా మంచి విమర్శలు చేస్తే వాటిని స్వీకరించాలి అన్నారు.. స్కూల్‌ పిల్లాడిలాగా అటెండెన్స్ కోసం అసెంబ్లీకి వచ్చారు.. అటెండెన్స్ వేసుకున్న వెంటనే పారిపోయారంటూ ఎద్దేవా చేశారు..

Read Also: CM Siddaramiah: ‘‘పాకిస్తాన్ రత్న’’.. పాకిస్తాన్‌లో సంచలనంగా సిద్ధరాయమ్య కామెంట్స్..

వైసీపీ నేతలకు ఏం చేయాలో తెలియక అవసరం లేని అభియోగాలు చేసి మతాల మధ్య.. కులాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి ఏదో చేయాలని చూస్తూ వారి నైజాన్ని కొనసాగించాలని చూస్తున్నారు విమర్శించారు సుభాష్‌.. దాన్ని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.. ఎట్టి పరిస్థితుల్లో ఇటు నిరుద్యోగం.. అటు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి మీద ఈ ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు.. వాళ్లు గత ఐదేళ్లలో ఏం చేశారో.. అవినీతిని ప్రశ్నిస్తారని అసెంబ్లీకి వస్తే ఏం చెప్పాలో తెలియక అయోమయ పరిస్థితిలో ఉన్నారు.. కాబట్టే వారు అసెంబ్లీకి రావటంలేదు.. ఏదో పోకిరి సినిమాలో నటుడు అలీలా బాబ్బబు అంటూ తిరుగుతున్నట్టు ప్రతిపక్షహోదా ఇవ్వమని భిక్షాటన చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.. జగన్ కి స్వయంగా తెలుసు 23 మంది ఎమ్మెల్యేలు లేనిదే ప్రతిపక్ష హోదా రాదని.. నాడు తెలుగుదేశానికి ప్రతిపక్షం లేకుండా చేద్దామని సర్వ ప్రయత్నాలు చేసి బంగపడ్డారు.. వాళ్లకి నిజంగా చిత్తశుద్ధి ఉండి అసెంబ్లీకి వచ్చి ఉంటే ప్రజలు నమ్మి ఉండేవారని అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు మంత్రి సుభాష్..

Exit mobile version