Aqua Farmers: ఫీడ్ ధరల పెంపుపై ఆక్వా రైతుల ఆగ్రహం.. నేడు రాష్ట్రస్థాయి సదస్సులో కీలక చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aqua Farmers: ఆక్వా రంగాన్ని ఓవైపు ఫీడ్ ధరలు.. ఎగుమతులపై ఆంక్షలు.. ఇలా వరుసగా సమస్యలు వేధిస్తున్నాయి.. అయితే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని క్షత్రియ కళ్యాణ మండపంలో నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి ఆక్వా రైతుల సదస్సు జరగనుంది. ఆక్వా రంగాన్ని వేధిస్తున్న ప్రధాన సమస్యలపై సదస్సులో విస్తృతంగా చర్చించనున్నారు. ముఖ్యంగా ఫీడ్ ధరలను ఒకే నెలలో రెండుసార్లు పెంచడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రొయ్యలకు గిట్టుబాటు ధర కల్పించడం, ప్రాసెసింగ్ ప్లాంట్ల తీరుపై చర్చించడం, నాణ్యమైన సీడ్ సరఫరా వంటి అంశాలు సదస్సులో ప్రధానంగా ప్రస్తావనకు రానున్నాయి. ట్రేసబిలిటీ లేని హేచరీలపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేయనున్నారు.
ఆక్వా రైతులకు విద్యుత్ రాయితీ పెంచాలని, వాటర్ మోటార్ల విద్యుత్ వినియోగంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. NCEL ద్వారా రొయ్యల కొనుగోళ్లు, కేంద్ర ప్రభుత్వ జోక్యం, రైతులు చెల్లించే ఆక్వా సెస్‌ను తిరిగి రైతుల సంక్షేమానికే వినియోగించడం, NFDB ద్వారా సబ్సిడీలు అందించడం వంటి అంశాలపైనా చర్చ జరగనుంది. అలాగే ఆక్వా రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న వైరస్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని రైతులు విజ్ఞప్తి చేయనున్నారు. ఆక్వా రైతుల భవిష్యత్తుకు కీలకమైన ఈ సదస్సుకు భారీగా తరలివచ్చి సమస్యల పరిష్కారానికి తమ గళాన్ని వినిపించాలని నిర్వాహకులు రైతులకు పిలుపునిచ్చారు.
Also Read
- Arnab Cyclone Alert: బీభత్సం సృష్టిస్తోన్న అర్నబ్ తుఫాన్.. తీరం దాటేది ఇక్కడే..!
- Arnab Cyclone: కోనసీమకు కాళరాత్రి.. గజగజ వణుకుతున్న లంక గ్రామాలు
- Arnab Cyclone Alert: తీరం వైపు వడివడిగా 'అర్నబ్'.. బీచ్‌కు రావొద్దు.. పర్యాటకులకు మెరైన్ పోలీసుల వార్నింగ్
- MP Mithun Reddy: చౌడేపల్లిలో మిథున్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. టీడీపీ నేతలే భయపడి పారిపోయారు..!
తాజావార్తలు
-
PM Modi: ఈసారీ వాళ్ల మధ్యే నా దీపావళి.. ప్రధాని మోడీ కీలక ప్రకటన!
-
Kamal Haasan : 23 ఏళ్ళకూ అదే పాట పాడుతున్న కమల్ హాసన్
-
Rakul : రకుల్’ను కాపాడిన రామాయణ
-
Israel Politics: మిడిలీస్ట్‌ను వణికించిన దేశానికి బాస్ ఎవరు? ఇజ్రాయెల్ పీఠంపై వీడని సస్పెన్స్!
-
Megaverse: ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, పవన్, రామ్ చరణ్.. నెట్‌ఫ్లిక్స్‌లో మెగా సునామీ!
ట్రెండింగ్
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!