Site icon NTV Telugu

Atreyapuram Putharekulu: షాకింగ్‌..! ఆత్రేయపురం పూతరేకుల్లో కల్తీ నెయ్యి.. వాడేది పశువుల కొవ్వు..!

Atreyapuram Putharekulu

Atreyapuram Putharekulu

Atreyapuram Putharekulu: మార్కెట్‌లో దొరికేది ఏది అసలు.. ఏది నకిలీ కనిపెట్టడమే కష్టంగా మారుతోంది.. బ్రాండెడ్‌ అనుకున్నదానిమాటులో.. ప్రజలు ఏం తింటున్నారో కూడా తెలియని పరిస్థితి.. ఇక, ఆత్రేయపురం పూతరేకులు అంటే.. అంతా లొట్టలేసుకుంటూ లాగించేస్తారు.. అంతర్జాతీయంగా పూతరేకుల తయారీకి గుర్తింపు పొందిన ఈ ఆత్రేయపురం పూతరేకుల్లో కల్తీ నెయ్యి వినియోగం ఇప్పుడు అందరినీ షాక్‌కు గురిచేస్తోంది.. ఎంతో ఇష్టంగా తినే పూతరేకుల్లో కల్తీ నెయ్యి వాడుతున్నారట.. పశువుల కొవ్వు వాడేస్తున్నారట.. కల్తీ నెయ్యి వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోతున్న వేళ.. ఆత్రేయపురం పూతరేకుల్లోనూ కల్తీ నెయ్యి వినియోగం పెరిగిపోయింది.. పశువుల కొవ్వు నుంచి వచ్చిన కల్తీ నెయ్యిని చిరు వ్యాపారులతో అమ్మకాలు సాగిస్తున్నారు.. ప్రజారోగ్యంతో చలగాటం ఆడుతున్నారు..

Read Also: PM Modi: ప్రశాంతత కావాలంటే రోటీ తినండి.. లేదంటే బుల్లెట్ దిగుతుంది.. పాక్‌కు మోడీ హెచ్చరిక

ఆత్రేయపురం అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది పూతరేకులే.. పూతరేకులకు పుట్టినిల్లుగా పేరుపొందిన అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలోని ఆత్రేయపురంలో ఇప్పుడు కల్తీ నెయ్యి వినియోగం విచ్చలవిడిగా సాగుతోంది.. రోజూ పూతరేకుల వ్యాపారం కోట్లలో జరుగుతోంది.. అయితే, ఈ పూతరేకుల్లో వినియోగించే నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.. ఎందుకంటే.. నెయ్యి వాడకుండా పూతరేకు ఉండదు.. ఎన్నో ఏళ్ల క్రితం పుట్టిన ఆత్రేయపురం పూతరేకులో కల్తీ నెయ్యి వినియోగం ఇప్పుడు అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది.. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం కింది వీడియో లింక్‌ను క్లిక్‌ చేయండి..

Exit mobile version