Site icon NTV Telugu

Minor Girl Assault: 6వ తరగతి బాలికను లైంగికంగా వేధించిన పీటీఐ..

Amb

Amb

Minor Girl Assault: అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ. పోలవరంలో షాకింగ్ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. 6వ తరగతి చదువుతున్న ఒక మైనర్ బాలికపై లైంగిక వేధింపులు జరిగిన ఘటన స్థానికంగా సంచలనం రేపుతుంది. తన కూతురి పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని గుర్తించిన బాలిక తల్లి, ఈ అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనలో నిందితుడు స్కూల్‌లో గతంలో పీటీఐ (Physical Training Instructor)గా పని చేసిన వెంకట కృష్ణగా పోలీసులు గుర్తించారు.

Read Also: Raipur: ఎక్కడా..ప్లేస్ దొరకలేదా.. కారులో శృంగారం చేస్తూ దొరికిన ప్రవచనకర్త

అయితే, ప్రస్తుతం వెంకటకృష్ణ ఓ రాజకీయ పార్టీకి చెందిన యాక్టివ్ కార్యకర్తగా ఉన్నట్లు తెలుస్తుంది. చాక్లెట్స్ ఇప్పిస్తాను అని చెప్పి బాలికను రూమ్‌లోకి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించినట్లు కంప్లైంట్ లో పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. చిన్నారులను లైంగికంగా వేధించే వాళ్లను చంపేయాలని బాలిక కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.

Exit mobile version