NTV Telugu Site icon

Ambati Rambabu: చంద్రబాబుకు వచ్చింది బెయిలే.. నిర్దోషి అనే తీర్పు కాదు.. రెచ్చిపోతే..!

Ambati Rambabu

Ambati Rambabu

ఆంధ్ర ప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఏపీ హైకోర్టు కీల‌క‌ తీర్పు ఇచ్చింది. చంద్రబాబుకు ముంద‌స్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నాలుగు వారాల పాటు అనారోగ్యం కార‌ణంగా మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక, ఇదే కేసులో భాగంగా ఇవాళ ఏపీ హైకోర్టు మరో విచార‌ణ చేసింది. ఈ మేర‌కు కీల‌క తీర్పును వెల్లడించింది. రెగ్యుల‌ర్ గా చంద్రబాబు నాయుడికి బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది.

Read Also: Goodachari 2: శోభితాకు చెల్లెలిగా ఉందనే తీసుకున్నావా.. శేష్ బ్రో.. ?

ఇక, ఈ మొత్తం వ్యవహారంపై ఇవాళ ట్విట్టర్ వేదికగా మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు వచ్చింది బెయిల్ మాత్రమే.. ఆయనను నిర్ధోషి అని ప్రకటించలేదు అనే విషయం గుర్తు పెట్టుకోవాలని మంత్రి అంబటి రాంబాబు ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. కోర్టు ఇచ్చిన తీర్పును శిరసా వహించాల్సిన టీడీపీ నేతలు తమ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై, పార్టీపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే.. తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. అయితే, చంద్రబాబు నాయుడిపై ఏపీ సీఐడీ అధికారులు ఇప్పటికే 8 కేసులు న‌మోదు చేశారు. ప్రస్తుతం ఏపీ స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించి మాత్రమే హైకోర్టు రెగ్యుల‌ర్ బెయిల్ ఇచ్చింది. కానీ, ఇదే కేసుకు సంబంధించి హైకోర్టు నిర్ణయాన్ని స‌వాల్ చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించారు.

Show comments