Ambati Rambabu Sensational comments on Pawan kalyan: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మీద ఏపీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. తాజాగా వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుని ఎదుర్కోవటం మాకు పెద్ద సమస్య కాదని అన్నారు. ఇక పవన్ గురించి ప్రస్తావిస్తూ మోస్ట్ కన్ఫ్యూజ్డ్ పర్సన్ దత్తపుత్రుడు పవన్ అని అన్నారు. ఇక వారాహి ఎక్కి తిరిగి పిచ్చి కూతలు కూస్తే సరిపోతుందా? అని ప్రశ్నించిన అంబటి ఇది క్యాస్ట్ వార్ కాదు క్లాస్ వార్ అని అన్నారు. ఇక కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవులు ఎలా ఓడిపోతారో మేం చూస్తామని పేర్కొన్న ఆయన పేదలే వచ్చే ఎన్నికల్లో గెలుస్తారని అన్నారు. ఇక రామోజీ ఒక వైట్ కాలర్ క్రిమినల్ అని పేర్కొన్న ఆయన వంగవీటి మరణానికి ముందు టీడీపీకి ముద్రగడ రాజీనామా చేశారు అని అన్నారు.
Pawan Kalyan: నా సినిమాలు సూపర్ హిట్.. కానీ ఏపీలో 30 కోట్ల నష్టం: పవన్ కళ్యాణ్
అప్పట్లో కాపునాడు జరిగినప్పుడు ముద్రగడ జైల్లో ఉన్నాడని, టీడీపీ వల్ల వంగవీటికి ప్రాణహాని ఉందని ముద్రగడ ఆనాడే చెప్పారని అన్నారు. కాపుల గురించి మాట్లాడే హక్కు ముద్రగడకు మాత్రమే ఉందని, హరిరామ జోగయ్యకు, పవన్ కు లేదని అన్నారు. చంద్రబాబు కోసం కాపులను పవన్ వాడుకోవాలని చూస్తున్నాడని పేర్కొన్న అంబటి తన మాటల వల్ల రోజు రోజుకి పవన్ గ్రాఫ్ పడిపోతుందని అన్నారు. రాజకీయాల్లో పవన్ ఆత్మహత్య చేసుకుంటున్నాడని పవన్ సీఎం కాదని చెప్పాక జనం కూడా వెళ్లిపోయారని అన్నారు. ఇక తనకు ప్రాణహాని ఉంటే పవన్ పోలీసులకు ఫిర్యాదు చెయ్యాలని అంబటి సలహా ఇచ్చారు. రాజకీయాలకు పవన్ పనికిరాడన్న ఆయన పవన్ నిలబడిన చోట డిపాజిట్లు కూడా రావని అన్నారు. ఇక లోకేష్ ఎక్కడ నిలబడితే అక్కడ ఓడిపోతాడని పవన్ వారాహి మీద కాదు పంది మీద ఎక్కాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక చంద్రబాబుతో చేరి పవన్ కూడా 420లా తయారయ్యాడని అంబటి రాంబాబు విమర్శల వర్షం కురిపించారు.
Ambati Rambabu: పవన్ వారాహి మీద కాదు పంది మీద ఎక్కాడు.. 420లా తయారయ్యాడు.. మంత్రి సంచలనం!
Show comments