NTV Telugu Site icon

Ambati Rambabu: చంద్రబాబు ప్రవేశపెట్టింది మేనిఫెస్టో కాదు.. మోసఫెస్టో

Ambati Rambabu On Cbn

Ambati Rambabu On Cbn

Ambati Rambabu Sensational Comments On Chandrababu Naidu: చంద్రబాబు ప్రవేశపెట్టింది మేనిఫెస్టో కాదు.. మోసఫెస్టో అని ఏపీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రకటించింది మెసఫెస్టో అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలనని పిలుపునిచ్చారు. తాము గడప గడపకు వెళ్ళి ధైర్యంగా మేనిఫెస్టో ఇస్తున్నామని అన్నారు. గతంలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేని వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. తను ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను ఎవరూ చూడకుండా తగలబెట్టిన వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు. టీడీపీ, వైసీపీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలపై ప్రజల మధ్య చర్చలు జరగాలని ఛాలెంజ్ చేశారు. రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. గతంలో తాను కాంగ్రెస్ పార్టీలో పనిచేసే సమయంలో.. మేనిఫెస్టో గురించి పట్టించుకునే వాళ్లమే కాదని బాంబ్ పేల్చారు. మేనిఫెస్టో అంటే ఒక బైబిల్, ఒక ఖురాన్, ఒక భగవద్గీతగా భావించి అమలు చేసే గొప్ప సీఎం జగన్ అని చెప్పుకొచ్చారు.

Botsa Satyanarayana: ఎన్నికలొస్తే.. పగటి వేషాల్లాగా చంద్రబాబు రంగులు మారుస్తాడు

అంతకుముందు కూడా.. మేనిఫెస్టో పేరుతో చంద్రబాబు మళ్లీ కొత్త డ్రామాకు తెరలేపారని అంబటి రాంబాబు విరుచుకుపడ్డారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి అసలు ఏ మేనిఫెస్టో అయినా అమలు చేశారా? అని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ అని మోసం చేసిన సంగతి జనం మర్చిపోలేదన్నారు. నిరుద్యోగులకు భృతి ఇస్తానని చెప్పి అప్పుడు కూడా మోసం చేయలేదా? అని నిలదీశారు. ఇవ్వాళ ప్రజల నెత్తిన మళ్ళీ వాగ్ధానాల టోపీ పెట్టారన్నారు. చంద్రబాబు ఇచ్చిన వాగ్ధానాలను నమ్మే స్థితిలో జనం లేరన్నారు. ఈసారి రానున్నది కురుక్షేత్ర యుద్దమేనని.. ఈ యుద్ధంలో తాము ఒంటరిగానే పోరాటం చేస్తామని చెప్పారు. పేదలు లేని వ్యవస్థను సృష్టిస్తానని చంద్రబాబు చెప్తున్నారని.. మరి, 14 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క పేదవాడినైనా ధనవంతుడిని చేశావా? అని నిలదీశారు. ఖరీదైన రాజకీయాలు చేసే చంద్రబాబు.. రాజకీయాలను కూడా వ్యాపారం చేశాడని మండిపడ్డారు. సైకిల్ స్క్రాబ్‌గా మారిపోయిందని, తుక్కుతుక్కు అయిన సైకిల్‌ని మళ్ళీ తొక్కాలని చంద్రబాబు తాపత్రయం పడుతున్నారని సెటైర్లు వేశారు.

Supreme Court: ఒడిశా రైలు ప్రమాదంపై విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని పిల్..

Show comments