NTV Telugu Site icon

Ambati Rambabu: రాజకీయ లబ్ది కోసమే లడ్డూపై చంద్రబాబు ఆరోపణలు..

Ambati Rambabu

Ambati Rambabu

Ambati Rambabu: టీటీడీ లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరుమల కల్తీ నెయ్యి టెండర్లలో అవకతవకలపై నలుగురిని అరెస్టు చేశారు.. జంతువుల కొవ్వు కలిసిందని గానీ, కల్తీ జరిగిందని గానీ ఎలాంటి ఆధారాలు లేవు.. పరిశుభ్రతకు, తిరుపతి ప్రసాదాలు మారు పేరు అని పేర్కొన్నారు. ఆవు నెయ్యి సరఫరాలో కూడా శాంపిల్ టెస్ట్ లు ఉంటాయి.. శాంపిల్ లో క్వాలిటీ లేకపోతే ఏ నెయ్యినీ తిరుమల కొండ పైకి అనుమతించరు.. గత ప్రభుత్వాలలో నాణ్యతా లేని అనేక సందర్భాలలో నెయ్యి వెనక్కి పంపారు.. వనస్పతి కలిసిందని అధికారులు చెప్తుంటే.. రాజకీయ లబ్ధి పొందాలని.. తిరుమల లడ్డు ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని చంద్రబాబు అసత్య ప్రచారాలు చేశారు.. దేవుడ్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలని చంద్రబాబు రాద్దాంతం చేస్తున్నారు అంబటి రాంబాబు పేర్కొన్నారు.

Read Also: Bunny Vasu: కేసు ఫైల్‌ అయితే, వెనక్కి తీసుకోలేము..జాగ్రత్త !

అయితే, తిరుపతి లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు వాడారని ఒక్క చంద్రబాబే కాదు పవన్ కళ్యాణ్ అనవసర ఆరోపణలు చేశారని అంబటి రాంబాబు తెలిపారు. తిరుమల లడ్డూల తయారీకి నెయ్యి సరఫరాకు ఒక పద్దతి ఉంటుందన్నారు. ఏఆర్ సప్లైస్ వారు చంద్రబాబు సీఎంగా వచ్చాకే నెయ్యి సరఫరా చేశారు.. టెస్టుల్లో ఫెయిల్ అయిన నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపుతారు.. జగన్, చంద్రబాబు హయాంలో టెస్టుల్లో ఫెయిల్ అయిన ట్యాంకర్లను వెనక్కి పంపారని మాజీ మంత్రి అంబటి చెప్పుకొచ్చారు.