Site icon NTV Telugu

Ambati Rambabu: ఏపీని శ్రీలంకలా మార్చేందుకు టీడీపీ, జనసేన కుట్ర

Ambati Rambabu

Ambati Rambabu

టీడీపీ, జనసేనపై మంత్రి అంబటి రాంబాబు ఓ రేంజ్‌లో ఫైరయ్యారు. అమలాపురం ఘటన దురదృష్టకరం, ఈ ఘటనను ఖండిస్తున్నాం అన్న మాట పవన్ నోటి నుంచి రాలేదని అంబటి ఆరోపించారు. ప్రభుత్వం ఉక్కుపాదంతో అల్లర్లను అణచివేయాలని పవన్ ఎందుకు డిమాండ్ చేయలేదని ప్రశ్నించారు. దాడులను ఖండించకుండా పవన్ ఏదేదో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కోనసీమ జిల్లా మార్పు అంశంలో గతంలో పవన్ కళ్యాణ్ పార్టీ వారు ఎందుకు నిరాహార దీక్షలు చేశారో చెప్పాలని నిలదీశారు. ప్రజల నుంచి డిమాండ్ వచ్చినపుడు పరిశీలించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని ఆయన గుర్తుచేశారు.

BYPOLL: నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల

తమ మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్లను తామే తగులబెట్టుకుంటామా అని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నల వర్షం కురిపించారు. ఏపీ కూడా శ్రీలంక అవుతుందని పవన్, చంద్రబాబు అన్నారని… ఇప్పుడు వాళ్లిద్దరూ రాష్ట్రాన్ని శ్రీలంకలా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని అంబటి ఆరోపించారు. చివరికి మంటలను ఆర్పడానికి ఫైరింజన్ రాకుండా అడ్డం వేశారని దుయ్యబట్టారు. అదేమన్నా మాట్లాడితే తుని సంఘటనను దీనికి ముడి పెడుతున్నారని..
డైవర్షన్ అనడానికి పవన్ కళ్యాణ్‌కు అసలు అవగాహన ఉందా అని నిలదీశారు. కోనసీమలో జరిగిన సంఘటనలో కచ్చితంగా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అంబటి రాంబాబు పేర్కొన్నారు.

Exit mobile version