NTV Telugu Site icon

Ambati Rambabu: మేము కాదు గాడిదలం.. నువ్వే అడ్డగాడిదవి.. పవన్ పై అంబటి ఫైర్

Pawan

Pawan

Ambati Rambabu:ఏపీ రాజకీయాలు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి., ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు వైసీపీ నేత అంబటి రాంబాబు కు మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. ఇక తాజాగా మరోసారి పవన్, అంబటిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈరోజు జరిగిన సభలో పవన్ మాట్లాడుతూ ” రాష్ట్రంలో అర్హులకు పెన్షన్లు అందడం లేదు. కాపు నేతలతో బూతులు తిట్టిస్తున్నారు. వైసీపీ గాడిదలకు చెప్తున్నా..అంబటి కాపుల గుండెల్లో కుంపటి. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. మీరు ఇరిగేషన్‌ మంత్రా. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మారబోతోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాదు అని చెప్పుకొచ్చాడు.

అంతేకాకుండా నాకు సినిమాలే ఆధారం.. అంబటిలాగా కాదు. మీరు నోరు పారేసుకుంటే నేను నోటికి పని చెప్తా. రాష్ట్రంలో రౌడీయిజం తగ్గాలి. మీరు తొక్కేస్తే మళ్లీ లేస్తా. బాధ్యత లేకుండా మాట్లాడే వైసీపీ నేతలకు బలంగా సమాధానం” అంటూ మండిపడ్డాడు. ఇక పవన్ వ్యాఖ్యలుపై అంబటి సోషల్ మీడియా ద్వారా ఫైర్ అయ్యాడు. ట్విట్టర్ లో పవన్ ఉద్దేశిస్తూ.. ” మేము కాదు గాడిదలం! బాబుని మోసే నువ్వే పెద్ద అడ్డ గాడిదవి! పవన్ కళ్యాణ్” అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.