Ambati Rambabu: తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి వేడుకలు జోరుగా సాగుతున్నాయి. ఈ తెల్లవారుజాము నుంచే భోగి మంటలు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, రంగవల్లులతో ప్రజలు వేడుకలను జరుపుకుంటున్నారు. మరోవైపు సత్తెనపల్లిలో నిర్వహించిన బోగిమంటల కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన భోగి మంటలు వేశారు. అనంతరం గిరిజనులతో కలిసి ఆటపాటలతో హుషారెత్తించారు. ఈ వేడుకల్లో ఆయన వేసిన బంజారా డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Read Also: Lalit Modi: ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోదీకి తీవ్ర అనారోగ్యం.. ఆస్పత్రిలో చికిత్స
మంత్రి అంబటి రాంబాబు స్టెప్పులు వేస్తున్న సమయంలో యువకులు కేరింతలు కొడుతూ ఆయనకు మద్దతు పలికారు. డప్పు కళాకారులు బంజారాలతో కలిసి భోగి మంటల చుట్టూ పాటలు పాడుతూ.. డ్యాన్సులు చేస్తూ పండుగను ఆస్వాదించారు. అటు భోగి సంబరాల్లో పాల్గొనటం సంతోషంగా ఉందని మంత్రి అంబటి పేర్కొన్నారు. ప్రజలకు తోడుగా జగనన్న సంక్షేమ పథకాలు ఉన్నాయని తెలిపారు. అంబటి రాంబాబు భోగీ మంటల చుట్టూ వేసిన స్టెప్పులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.