Site icon NTV Telugu

Ambati Rambabu: రోత స్టార్.. బూతు స్టార్.. పవన్ కళ్యాణ్

Ambati

Ambati

Ambati Rambabu: ఏపీ రాజకీయాలు రోజురోజుకు హీటెక్కుతున్నాయి. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఒకరిమీద ఒకరు మాటల యుద్దాన్ని మొదలుపెట్టారు. ముఖ్యంగా వైసీపీ నేతలు జనసేన మీద .. పవన్ కళ్యాణ్.. వైసీపీ మీద విరుచుకుపడుతున్నారు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఇంకోపక్క జనసేనానిపై నీటిపారుదల శాఖమంత్రి అంబటి రాంబాబు నిత్యం విమర్శలు గుప్పిస్తూనే ఉంటారు. అయితే మీడియా ముందు.. లేకపోతే సోషల్ మీడియాలో.. పవన్ పై కౌంటర్లు వేస్తూ ఉంటారు. ఇక మొన్నటికి మొన్న పవన్.. వారాహి యాత్రలో ఏ క్రిమినల్స్ అయితే ప్రజలను ఏడిపించారో వాళ్లను బట్టలూడదీసి కొడతాం అంటూ అన్న వ్యాఖ్యలకు అంబటి తనదైన రీతిలో కౌంటర్ ఇచ్చారు.

AP Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..SSC బోర్డులో ఉద్యోగాలు..

“మొన్న చెప్పు తీసుకుని కొడతా అన్నాడు. మేమందరం రౌడీలం అంట.. ఇప్పుడు మమ్మల్ని రోడ్డు మీద గుడ్డలూడదీసి కొడతాడంట. కొట్టించుకోవడానికి తేరగా ఉన్నాం.. రమ్మనండి. ఇదేమైనా సినిమా అనుకున్నాడా?” అంటూ చెప్పుకొచ్చారు. ఇక తాజాగా ట్విట్టర్ లో పవన్ ను రోత స్టార్.. బూతు స్టార్ అంటూ తిట్ల దండకం మొదలుపెట్టారు. ” సినిమా స్టార్ ప్యాకేజి స్టార్ కామెడీ స్టార్ కోతల స్టార్ రోత స్టార్ బూతు స్టార్.. బా..గా.. పడిపోయావు పవన్ కళ్యాణ్” అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ట్వీట్ పై పవన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మినిస్టర్ గా మీరేమో చెయ్యాలో రాష్ట్రానికి అది చేయండి అంతేగానీ పవన్ కళ్యాణ్ గురుంచి మాట్లాడటానికి మీకు మంత్రి పదవి ఇవ్వలేదు అని కొందరు.. విమర్శించడం కాదు..రాష్ట్రానికి అభివృద్ధి ఎలా తీసుకురావాలో అది చేయండి ఫస్ట్ అని ఇంకొందరు కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ ట్వీట్ పై జనసేనాని ఎలా స్పందిస్తాడో చూడాలి.

Exit mobile version