Site icon NTV Telugu

Ambati Rambabu: ఆఖరి ఛాన్స్ అంటే అధికారం రాదు.. ప్రజల మెప్పు పొందాలి

Ambati Rambabu

Ambati Rambabu

Ambati Rambabu: ఏపీలో వికేంద్రీకరణపై మంత్రి అంబటి రాంబాబు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకణ చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. ఎంతో మంది ముఖ్యమంత్రులను తాను దగ్గరగా చూశానని.. సీఎం జగన్ తీసుకువచ్చిన మార్పులు ఎవ్వరి వల్ల సాధ్యం కాలేదన్నారు. ఆఖరి ఛాన్స్ అని చంద్రబాబు ప్రజలను బెదిరిస్తున్నారని.. ఆఖరి ఛాన్స్ అంటే అధికారం రాదని.. ప్రజల మెప్పు పొందితేనే అధికారం వస్తుందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.

Read Also: Top Headlines @5 PM: టాప్ న్యూస్

ఇటీవల ఒకాయన పవన్ కళ్యాణ్ తమ బంధువు అన్నాడని.. బంధువు అయితే భోజనం పెట్టి పంపించాలని.. బంధువైనంత మాత్రాన రాజ్యాధికారం ఇవ్వలేమని అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా పుట్టిన పార్టీ తనది అని పవన్ అంటున్నారని.. ప్రజలకు మేలు చేయడం కోసం రాజకీయాలు చేయాలి కానీ.. ఎవరికో లబ్ధి చేకూర్చడానికి రాజకీయాలు చేయకూడదని హితవు పలికారు. అటు చంద్రబాబు అండతోనే మార్గదర్శిలో అక్రమాలు జరుగుతున్నాయని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. అక్రమంగా డిపాజిట్లను సేకరించి బ్యాంకులో జమ చేయకుండా పక్కదారి పట్టిస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు విమర్శలు చేశారు.

Read Also: Naked PhotoShoot: 2500 మంది ఒక్కసారిగా బట్టలన్నీ విప్పేశారు.. కారణం ఏంటంటే..?

Exit mobile version