Site icon NTV Telugu

Ambati Rambabu:జూన్ 10 నుంచి కృష్ణాడెల్టాకు సాగునీరు

Amba2

Amba2

కృష్ణా డెల్టా రైతులకు ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు శుభవార్త తెలిపారు. జూన్ పదో తేదీ నుండి కృష్ణా డెల్టాకు సాగు నీరు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి అంబటి తెలిపారు. ఎమ్మెల్యే ఉదయభానుతో కలిసి పులిచింతల ప్రాజెక్టుని సందర్శించారు మంత్రి అంబటి రాంబాబు. గత ఏడాది ఆగస్టులో కొట్టుకుపోయిన గేటు ప్రాంతాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు మంత్రి.

గతంలో ఎప్పుడూ లేని విధంగా జూన్ లోనే ‌సాగునీరు ఇవ్వనున్నాం. పులిచింతలలో 33 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వర్షాకాలం ముందే రానుంది. సకాలంలో వర్షాలు పడతాయని భావిస్తున్నాం. గత ఏడాది కొట్టుకుపోయిన గేటు స్థానంలో కొత్త గేటు ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సాంకేతిక నిపుణులు దానిపై పని చేస్తున్నారు. స్టాప్ గేటు ఉంది. ప్రస్తుతానికి ఎటువంటి ఇబ్బంది లేదన్నారు మంత్రి అంబటి రాంబాబు. మంత్రి వెంట కలెక్టర్ శివశంకర్ కూడా వున్నారు.

Gyanvapi Mosque : జ్ఞానవాపి మసీదుపై సుప్రీం కోర్ట్ కీలక ఆదేశాలు

Exit mobile version