YSRCP Rythu Poru: మరో ఆందోళనకు సిద్ధమైంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఈనెల 9వ తేదీన వైసీపీ ‘అన్నదాత పోరు’ పేరుతో కార్యక్రమాలు నిర్వహించనుంది.. యూరియా కొరత, రైతాంగ సమస్యలపై నిరసనలకు పిలుపునిచ్చింది.. ఆర్డీవో కార్యాలయాల ఎదుట వైసీపీ శాంతియుత నిరసనలు తెలపనుంది.. ‘అన్నదాత పోరు’ పోస్టర్‌ని పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విడుదల చేశారు.. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, నందిగం సురేష్, వెల్లంపల్లి శ్రీనివాస్, టీజేఆర్ సుధాకర్ బాబు, రాయన భాగ్యలక్ష్మి, మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. ఈ నెల తొమ్మిదవ తేదీన రైతుల సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు పోరు కార్యక్రమం నిర్వహించాలని పిలుపునిచ్చారు..
Read Also: Tihar Jail: తీహార్ జైల్లో ఎంపీ రషీద్‌పై దాడి.. రక్షణ కల్పించాలని కేంద్రానికి కుటుంబం విజ్ఞప్తి
రైతులకు జగన్ ప్రభుత్వం పెద్దపీట వేసింది.. కానీ, కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటి పోయింది అని మండిపడ్డారు వైసీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి.. ప్రభుత్వం వచ్చిన పదిహేను నెలలలో జగన్ చేసిన అభివృద్ధిని విధ్వంసం చేసింది కూటమి సర్కార్ అని విమర్శించారు.. అరాచకం తప్ప ప్రభుత్వం చేసిందేమీ లేదు.. రాష్ట్రంలో మాఫియా ముఠాలు నడుస్తున్నాయి.. వ్యవసాయానికి అవసరమైన ఎరువులు, విత్తనాలు దొరకడం లేదు.. చంద్రబాబు ప్రభుత్వం చేతులు ఎత్తేసింది.. ఎరువుల కొరత లేదని ప్రభుత్వం చెబుతుంది.. రైతులు మాత్రం క్యూ లైన్‌లో నిలబడి ఉంటున్నారు. ఎరువుల అక్రమ నిలువలు ఉంచి.. టీడీపీ ఎమ్మెల్యేలు బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు.. మాఫియా రాజ్యం నడుస్తుందన్నారు.. రైతులు రైతుల్లా ఉండండి.. రాజకీయాలు చేస్తే బొక్కలో వేస్తానని బెదిరిస్తున్నారు. రైతులకు మద్దతు ధర లేదు.. జగన్ వెళ్ళగానే కేంద్రానికి ఒక లేఖ రాస్తున్నారు. కానీ, రైతులు, వ్యవసాయాన్ని గాలికి వదిలేశారని పేర్కొన్నారు.
Read Also: Asia Cup 2025: దుబాయ్ చేరుకున్న భారత జట్టు.. హార్దిక్ పాండ్యా న్యూ లుక్ వైరల్..
యూరియా ఎక్కువ వాడితే క్యాన్సర్ వస్తుంది అంటూ చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు.. రైతులు అంటే ఏమి తెలియదు అనుకుంటున్నారా..? అని ప్రశ్నించారు సజ్జల.. నియంతలు కూడా చంద్రబాబు లాగా వ్యవహరించలేదు.. చంద్రబాబుకి అధికారం విలువ తెలియదు.. ప్రజల పట్ల బాధ్యత లేదు అని ఫైర్ అయ్యారు. యూరియా కొరత పై శాంతియుత ర్యాలీలు తొమ్మిదో తేదీ జరుగుతాయి. సంక్షోభం వస్తే చంద్రబాబుకి ఆదాయం వస్తుంది. చంద్రబాబు, ఆయన కోఠరి ఇల్లు చక్కబెట్టుకునే పనిలో ఉన్నారు అంటూ ఆరోపణలు గుప్పించారు సజ్జల రామకృష్ణారెడ్డి..
