Site icon NTV Telugu

YSRCP: ఎల్లుండి వైసీపీ శాసనసభా పక్ష సమావేశం.. జగన్‌ అసెంబ్లీకి వస్తారా..?

Jagan Ys

Jagan Ys

YSRCP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు సమయం దగ్గర పడుతోంది.. సెప్టెంబర్ 18 నుంచి అంటే ఎల్లుండి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకాబోతున్నాయి.. 10 రోజుల పాటు శాసనసభ సమావేశాలు నిర్వహించాలనే యోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది.. అయితే, ఈసారి అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌తో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు హాజరుఅవుతారా? లేదా? అనేదానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.. ఈ నేపథ్యంలో.. ఎల్లుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది..

Read Also: IAS Transfers: రాష్ట్ర వ్యాప్తంగా నలుగురు ఐఏఎస్ అధికారుల బదిలీలు..

వైసీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో ఎల్లుండి వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ సమావేశం కాబోతున్నారు.. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు వైసీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో (శాసనసభా పక్ష ) సమావేశంకానున్నారు వైఎస్‌ జగన్.. ఈ సమావేశంలో సమకాలీన రాజకీయ అంశాలు, ప్రజాసమస్యలు తదితర అంశాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చర్చించనున్నారు వైఎస్ జగన్‌.. అయితే, అసెంబ్లీ సమావేశాలకు హాజరుపై ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది ఇప్పుడు చర్చగా మారింది.. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇస్తేనే.. తమ పార్టీ అధినేత జగన్.. అసెంబ్లీకి వస్తారని వైసీపీ నేతలు చెబుతుండగా.. సీట్ల సంఖ్య సరిగా లేనిది? ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది..? అది నా చేతిలో లేదు.. ప్రజలే మీకు ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేశారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానిస్తున్నారు.. ఈ నేపథ్యంలో.. ఎల్లుండి వైఎస్ జగన్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి..

Exit mobile version