YSRCP: అలర్ట్ అయిన వైసీపీ.. కడప జడ్పీటీసీలకు అధిష్టానం పిలుపు..
- కడప జిల్లాలో వైసీపీ అలర్ట్..
- జడ్పీటీసీలకు అధిష్టానం నుంచి పిలుపు..
- జడ్పీటీసీలు అందరూ ఈ నెల 21వ తేదీన విజయవాడకు రావాలంటూ ఆదేశాలు..
- ప్రత్యేకంగా సమావేశం కానున్న వైఎస్ జగన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSRCP: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారిన తర్వాత.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొందరు ప్రజాప్రతినిధులు, నేతలు.. అధికార టీడీపీ కూటమి వైపు చూస్తున్నారు.. ఇప్పటికే పలు మున్సిపాల్టీలను తమ ఖాతాలో వేసుకుంది తెలుగుదేశం పార్టీ.. అయితే, కడప జిల్లాలో వైసీపీ అలర్ట్ అయ్యింది.. ఉమ్మడి కడప జిల్లాలోని జడ్పీటీసీలకు అధిష్టానం నుంచి పిలుపు వెళ్లింది.. జిల్లాలోని జడ్పీటీసీలు అందరూ ఈ నెల 21వ తేదీన విజయవాడకు రావాలంటూ ఆదేశాలు వెళ్లాయి.. జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజీనామాతో.. జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఖాళీగా ఉంది.. దీంతో.. జిల్లా పరిషత్ చైర్మన్ పదవి చేజారకుండా కసరత్తు ప్రారంభించింది వైసీపీ..
Read Also: CLP Meeting: రేపు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం..
Also Read
- Pawan Kalyan : గోదావరి పుష్కరాలకు పవన్ మాస్టర్ ప్లాన్.. 268 మోడల్ పంచాయతీలు సిద్ధం.!
- AP Weather Update : ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాలు, వడగాల్పుల డబుల్ అలర్ట్.!
- IndiGo Flight : వాతావరణం దెబ్బకు ఇండిగో విమానం డైవర్ట్.. రాజమండ్రిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్.!
- AP NDA: కూటమి భారీ ప్లాన్.. రెండేళ్ల పాలన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ
కాగా, కడప జిల్లాలో మొత్తం 50 జడ్పీటీసీ స్థానాలు ఉండగా వాటిలో రెండు ఖాళీగా ఉన్నాయి.. 48 జడ్పీటీసీ సభ్యులలో ఒక గోపవరం మినహా అందరూ వైసీపీ జడ్పీటీసీలే.. సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు ఐదురు జడ్పీటీసీలు.. మరో జడ్పీటీసీ.. బీజేపీ గూటికి చేరారు.. ఈ నేపథ్యంలో.. మరింత మంది జడ్పీటీసీలు చేజారకుండా.. కడప జెడ్పీ చైర్మన్ పదవి కూడా దూరంగా కాకుండా పావులు కదుపుతోంది వైసీపీ అధిష్టానం.. అందులో భాగంగా.. అందరినీ విజయవాడకు రమ్మని పిలుపునిచ్చారు.. ఇక, విజయవాడలో జడ్పీటీసీలతో వేర్వేరుగా వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశం అవుతారని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Ashok Gehlot: కాంగ్రెస్‌లో నాపై కుట్ర.. అధ్యక్ష పదవి లాక్కున్నారు
-
Russia: చమురు మార్కెట్‌ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
The Paradise: నానీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఆగస్టు రేసు నుంచి తప్పుకున్న ‘ది ప్యారడైజ్’? కారణం ఇదేనట!
-
School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా, సంక్రాంతి సెలవుల ప్రకటన.. ఎన్నిరోజులంటే..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!