NTV Telugu Site icon

NTR Health University: మారిన హెల్త్‌ యూనివర్సిటీ పేరు.. గెజిట్‌ విడుదల

Ntr

Ntr

NTR Health University: వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ పేరును డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీగా మారుస్తూ ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లోని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.. ఇక, ఈ బిల్లును రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రవేశపెట్టిన బిల్లును టీడీపీ, జనసేన, బీజేపీ పక్షాల సభ్యులు బలపరిచారు.. ఇక, వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై గెజిట్‌ విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం.. వైఎస్సార్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరును ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీకిగా పునరుద్ధరిస్తూ గెజిట్ విడుదల చేశారు.. ఇకపై ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరుతో కార్యకలాపాలు సాగించనుంది హెల్త్ యూనివర్శిటీ యాజమాన్యం.

Read Also: Guntur: గుంటూరులో కలకలం.. చెత్తకుప్ప దగ్గర ప్రభుత్వ శాఖల ఫైళ్లు..

కాగా, గతంలో ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరును డాక్టర్ వైఎస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌గా మారుస్తూ.. గత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సర్కార్‌ 2022లో నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.. ఈ పరిణామాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు.. విపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి.. దీనిపై పెద్ద దుమారమే రేగింది.. ఇక, ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. మళ్లీ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Show comments