YS Jagan: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించనున్నారు.. ఇటీవల పోలీసుల చేతిలో లాఠీదెబ్బలు తిన్న జాన్ విక్టర్‌ను పరామర్శించనున్నారు.. అయితే, వైఎస్ జగన్.. తెనాలి పర్యటన పాలక-ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది.. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి రోడ్డు మార్గాన బయల్దేరి ఉదయం 11.15 గంటలకు తెనాలి ఐతానగర్ చేరుకోనున్నారు వైఎస్ జగన్.. అనంతరం ఇటీవల పోలీసుల దాడిలో గాయపడ్డ జాన్ విక్టర్, అతని కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1.15 గంటలకు తాడేపల్లి చేరుకుంటారు వైఎస్ జగన్..
Read Also: IPL 2025 Final: ఐపీఎల్ ఫైనల్లో బెంగళూరు, పంజాబ్ అమీతుమీ.. తొలి కల తీరేదెవరిదో!
తెనాలి సీఐ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని యువకులపై దాడి చేశారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు.. వైసీపీ నేతలపై అన్యాయంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సజ్జల.. అయితే, రాజకీయ లబ్ధికోసం విద్వేషాలు రాజేస్తున్నారంటూ వైఎస్ జగన్‌పై సంచలన ఆరోపణలు చేశారు ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత.. మరోవైపు, జగన్ తెనాలి పర్యటనపై మంత్రి నాదెండ్ల మనోహర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.. రాజకీయ దురుద్దేశంతోనే వైఎస్ జగన్.. తెనాలికి వెళ్తున్నారంటూ మండిపడ్డారు మంత్రి నాదెండ్ల మనోహర్.. కాగా, గుంటూరు జిల్లా తెనాలిలో పోలీసులపై గంజాయి బ్యాచ్ దాడి చేయడం.. ఆ తర్వాత వారిని పట్టుకుని రోడ్డుపైనే పోలీసులు లాఠీలతో అరికాళ్లపై కొట్టడం చర్చగా మారింది.. ఈ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. పోలీసుల చర్యలను కొందరు సమర్థిస్తుంటే.. మరికొందరు విమర్శిస్తున్నారు.. ఇక, ఈ ఘటనపై హోంమంత్రి అనిత స్పందిస్తూ.. పోలీసులు యాక్షన్ తీసుకోలేదంటారని, ఒక స్టెప్ ఫార్వాడ్ వేస్తే ఈ రకంగా విమర్శిస్తారన్నారు.. పోలీసుల్ని కొంత పనిచేసుకోనివ్వాలని అని వ్యాఖ్యానించారు హోంమంత్రి అనిత..
