YS Jagan: స్థానిక సంస్థల ప్రతినిధులతో నేడు జగన్‌ భేటీ

  • తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ భేటీ..
  • స్థానిక సంస్థల ప్రతినిధులతో సమావేశం కానున్న వైసీపీ అధినేత..
Ysjagan

Ysjagan

YS Jagan: వరుసగా వివిధ జిల్లాల నేతలు, పార్టీ నేతలు, ప్రజా సంఘాలు.. ఇలా వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఇవాళ తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో స్థానిక సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నారు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్.. ఈ సమావేశానికి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా మండపేట మున్సిపాలిటీ, అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపాలిటీ, కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు నగర పంచాయతీ, శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం వైసీపీ స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులతో భేటీ కానున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు జగన్.. మరోవైపు, నేడు ప్రకాశం జిల్లా పొదిలిలో వైఎస్‌ జగన్ పర్యటనకు వెళ్లనున్నారు.. పొదిలి పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించనున్నారు జగన్.. పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించేలా కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో భాగంగానే ఈ పర్యటనకు వెళ్లనున్నారు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి..

Read Also: Virat Kohli: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. ఐపీఎల్ చరిత్రలోనే ‘ఒకే ఒక్కడు’!