Site icon NTV Telugu

YS Jagan: వల్లభనేని వంశీని పరామర్శించనున్న వైఎస్‌ జగన్‌..

Jagan

Jagan

YS Jagan: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు.. ఆ తర్వాత కోర్టులో హాజరుపర్చగా.. 14 రోజుల రిమాండ్‌ విధించారు న్యాయమూర్తి.. కిడ్నాప్‌, బెదిరింపుల కేసులో వంశీని అరెస్ట్ చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు.. ఆయన రిమాండ్‌ రిపోర్ట్‌లో కీలక అంశాలను ప్రస్తావించారు.. 14 రోజుల రిమాండ్‌ విధించడంతో.. విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.. అయితే, రేపు వల్లభనేని వంశీని పరామర్శించనున్నారు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. విజయవాడ జిల్లా జైలులో కిడ్నాప్ కేసులో రిమాండ్ లో ఉన్న వల్లభనేని వంశీని ఆయన రేపు కలుస్తారు.. ఇప్పటికే వంశీ భార్య పంకజశ్రీని ఫోన్‌లో పరామర్శించిన జగన్.. ఆమెకు భరోసా ఇచ్చారు.. వంశీ అరెస్ట్ రోజు జరిగిన పరిణామాలను అడిగి తెలుసుకున్నారు.. రేపు ఉదయం 10.30 గంటలకు పలువురు వైసీపీ నేతలతో కలసి విజయవాడ జిల్లా జైలుకు వెళ్లనున్న వైఎస్‌ జగన్‌.. ములాఖత్ లో వల్లభనేని వంశీని కలిసి పరామర్శించనున్నారు.. కాగా, ఇప్పటికే పలు కేసుల్లో అరెస్ట్‌ అయిన వైసీపీ నేతలను కూడా వైఎస్‌ జగన్‌ పరామర్శిస్తూ.. వారికి ధైర్యాన్ని చెబుతూ.. భరోసా ఇస్తూ వస్తోన్న విషయం విదితమే..

Read Also: Nara Lokesh: కుంభమేళాలో మంత్రి లోకేష్ దంపతుల పుణ్యస్నానాలు.. కుమారుడితో సెల్ఫీ వైరల్‌..!

Exit mobile version