YS Jagan: ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రుల బృందం సింగపూర్ పర్యటనపై హాట్ కామెంట్లు చేశారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వైసీపీ పీఏసీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేవలం దోచుకున్న డబ్బులు దాచుకోవడానికి మాత్రమే సింగపూర్ పర్యటన అని ఆరోపించారు.. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రావడంలేదు.. అంతా దోచుకుంటున్నారని మండిపడ్డారు.. మహిళలకు నెలకు రూ.1500 ఇస్తానని, ఇప్పుడు రాష్ట్రాన్ని అమ్మాలి అంటున్నారు.. ఇంత కన్నా పచ్చిమోసం ఉంటుందా? అని నిలదీశారు.. ఫీజురియింబర్స్ మెంట్ ఇవ్వకపోవడం వల్ల పిల్లల చదువులు మానేస్తున్న పరిస్థితులు వచ్చాయి. రైతులను పరామర్శించడానికి వెళ్తే కేసులు పెడుతున్నారు. ఐదేళ్లలో అన్నిరకాల అప్పులు రూ.3.32 లక్షల కోట్లు చేశాం.. ఈ 14 నెలల్లో చంద్రబాబు అందులో 52శాతం చేశాడు.. ఏ పథకం లేదు, ఏ స్కీమూ లేదు.. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రావడంలేదు.. అంతా దోచుకుంటున్నారు.. కేవలం దోచుకున్న డబ్బులు దాచుకోవడానికి మాత్రమే సింగపూర్ పర్యటన అని దుయ్యబట్టారు.
Read Also: Tharun Bhascker : యాంకర్‌కి లైవ్ ఈవెంట్‌లో ప్రపోజ్ చేసిన స్టార్ డైరెక్టర్..
ఇక, పార్టీ తరఫున త్వరలో యాప్ విడుదలచేస్తాం.. ప్రభుత్వ వేధింపులు జరిగినా, అన్యాయం జరిగినా.. వెంటనే యాప్‌లో నమోదు చేయవచ్చు అన్నారు వైఎస్ జగన్.. పలానా వ్యక్తి, పలానా అధికారి కారణంగా అన్యాయంగా ఇబ్బంది పడ్డానని చెప్పొచ్చు.. ఆధారాలుకూడా ఆ యాప్‌లో పెట్టొచ్చు.. ఆ ఆధారాలన్నీకూడా అప్‌లోడ్ చేయొచ్చు.. ఆ కంప్లైంట్ ఆటోమేటిగ్‌గా మన డిజిటల్ సర్వర్‌లోకి వచ్చేస్తోంది.. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆఫిర్యాదులపై కచ్చితంగా పరిశీలన చేస్తాం.. అన్యాయానికి గురైన వారంతా ఈ యాప్ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చు అన్నారు.. ఆధారాలుగా ఉన్న వీడియోలు, పత్రాలను అప్‌లోడ్ చేయొచ్చు.. ఈ ఫిర్యాదులపై పరిశీలన జరిపి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.. తప్పు చేసిన వారందరికీ సినిమా చూపించడం ఖాయం అని హెచ్చరించారు జగన్..
Read Also: Karnataka: ప్రభుత్వంలో ముసలం.. సిద్ధరామయ్య సమావేశాలకు డీకే.శివకుమార్ దూరం!
ఇప్పుడు చంద్రబాబు ఏదైతో విత్తారో అదే చెట్టవుతోంది. రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో.. కార్యక్రమం కింద బాబు ష్యూరిటీ, మోసం గ్యారంటీ.. కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి. మండలాల్లో కూడా దాదాపుగా పూర్తికావొచ్చిందన్నారు జగన్.. 90 నియోజకవర్గాల్లో గ్రామస్థాయిలోకూడా ప్రారంభమై ముమ్మరంగా సాగుతోంది.. వచ్చే నెలలో రచ్చబండ కార్యక్రమం ద్వారా గ్రామస్థాయిలో బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ కార్యక్రమం ఉద్ధృతంగా చేయాలి.. క్యూ ఆర్ కోడ్ ద్వారా చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలు, ప్రతి కుటుంబానికీ ఎంత బాకీ పడ్డాడో చెప్పాలి.. రచ్చబండ కార్యక్రం ద్వారా కమిటీల ఏర్పాటుకూడా ఉద్ధృతంగా సాగుతోంది.. బాబుష్యూరిటీ, మోసం గ్యారంటీ కింద గ్రామస్థాయిలో జరుగుతున్న రచ్చబండ కార్యక్రమం చాలా పగడ్బందీగా జరగాలి.. మంచి ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నామన్న భావన ప్రజల్లో బాగా వెల్లడవుతోంది.. ఇస్తానన్న బిర్యానీ లేదు. ఉన్న పలావు కూడా పోయింది.. అందుకే మన కార్యక్రమాలకు విశేష స్పందన లభిస్తోంది.. చిన్న చిన్న విభేదాలను రూపుమాపి అందర్నీ ఒక్కతాటిపైకి తీసుకు రావాలని సూచించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్..
