Site icon NTV Telugu

YS Jagan: రేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై స్పందించిన జగన్‌.. సంచలన వ్యాఖ్యలు..

Ys Jagan

Ys Jagan

YS Jagan: రేషన్‌ బియ్యం అక్రమ రవాణా వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా సాగుతూ వస్తోంది.. కొన్ని సార్లు మంత్రులు.. తాజాగా డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ స్వయంగా రంగంలోకి దిగి.. రేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై ఆరా తీయడం.. అధికారులు.. వ్యవస్థలపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం చర్చగా మారింది.. అయితే, రేషన్‌ బియ్యం అంశంపై స్పందించారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్.. ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలతో సమావేశమైన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వంలో మంత్రులు వాళ్లవాల్లే, అధికారులు వాళ్ల మనుషులే, చివరకు చెక్‌పోస్టులు వాళ్లు పెట్టినవే .. పోర్టులో కస్టమ్స్‌ వాళ్లు, భద్రతా సిబ్బంది వాళ్లే.. కేంద్రంలోనూ వాళ్లే ఉన్నారు, రాష్ట్రంలోనూ వాళ్లే ఉన్నారు.. ఆర్థిక మంత్రి పయ్యావుల సొంత వియ్యంకుడు బియ్యాన్ని ఎగుమతిచేస్తున్నారు.. కానీ, ఆ షిప్‌ దగ్గరకు మాత్రం వెళ్లలేదు అంటూ సంచలన ఆరోపణలు చేశారు..

Read Also: ICC Mens Player Of The Month: బుమ్రాను కాదని.. పాకిస్తాన్ ఆటగాడికి అవార్డు

ఇక, బియ్యం ఎగుమతిలో ఏపీ దేశంలోనే నంబర్‌ వన్‌ అని పేర్కొన్నారు వైఎస్‌ జగన్‌.. దశాబ్దాలుగా బియ్యం ఎగుమతులు ఇక్కడ నుంచే జరుగుతున్నాయి. పయ్యావుల వియ్యంకుడు బియ్యం ఎగుమతుల్లో నంబర్‌ వన్‌గా ఉన్నాడన్నారు.. అసలు వ్యవస్థీకృత నేరాలు ఎవరు చేస్తున్నారు? అదనంగా పండించే బియ్యాన్ని ఎగుమతి చేయడంలో తప్పులేదు.. కానీ, దీన్ని ఇప్పుడు ట్విస్ట్‌ చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. మన ప్రభుత్వం హయాంలో డీలర్ల వద్ద తప్పులు జరుగుతున్నాయని, దాన్ని పక్కనపెట్టి.. నేరుగా వాహనాల ద్వారా లబ్ధిదారులకు అందించామని గుర్తుచేశారు జగన్.. స్వర్ణ రకం తినగలిగే బియ్యాన్ని అందించాం.. రేషన్‌ బియ్యం దుర్వినియోగానికి పుల్‌స్టాప్‌ పెట్టింది మనమే.. కానీ, మళ్లీ ఈ ప్రభుత్వంలో అన్ని పద్దతులూ మార్చారు. మళ్లీ డీలర్లకు అన్ని అప్పగించారని ఆరోపించారు.. సార్టెక్స్‌ బియ్యాన్ని ఇవ్వడం లేదు.. ప్రజలకు నాసిరకం బియ్యం సరఫరా చేస్తున్నారు. ప్రజలకు సరిగ్గా బియ్యం ఇవ్వడంలేదు. దీనివల్ల మళ్లీ రేషన్‌ మాఫియా వచ్చింది. ఎమ్మెల్యేలకూ కమీషన్లు వెళ్లే పరిస్థితి ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి..

Exit mobile version