Site icon NTV Telugu

YS Jagan Foreign Tour: వైఎస్‌ జగన్‌ విదేశీ పర్యటనకు గ్రీన్‌ సిగ్నల్.. సీబీఐ కోర్టు కీలక ఆదేశాలు

Ys Jagan, Ys Bharathi

Ys Jagan, Ys Bharathi

YS Jagan Foreign Tour: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. కుటుంబ సభ్యులతో కలిసి యునైటెడ్ కింగ్‌డమ్ (UK)తో పాటు యూరప్ దేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 20వ తేదీ నుంచి వచ్చే నెల (మే) 15వ తేదీ వరకు మొత్తం 25 రోజుల పాటు విదేశీ పర్యటనకు కోర్టు అనుమతించింది. ఈ కాలంలో కుటుంబ సభ్యులతో కలిసి యూరప్, యూకే ప్రాంతాల్లో పర్యటించేందుకు వైఎస్‌ జగన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Read Also: MLA Pulivarthi Nani: చెవిరెడ్డికి పులివర్తి నాని వార్నింగ్.. “సినిమా చూపిస్తా”..!

అయితే పర్యటనకు ముందు కొన్ని షరతులు కూడా విధించింది సీబీఐ కోర్టు… దేశం విడిచి వెళ్లే ముందు తన కాంటాక్ట్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీ, పూర్తి ప్రయాణ వివరాలు, అలాగే ష్యూరిటీ వివరాలను సీబీఐ అధికారులకు అందజేయాలని కోర్టు ఆదేశించింది. అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్లాలంటే తప్పనిసరిగా సీబీఐ కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆయన కోర్టును ఆశ్రయించగా, పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం అనుమతి మంజూరు చేసింది. దీంతో సీబీఐ కోర్టు ఆదేశాల మేరకు వైఎస్ జగన్ త్వరలోనే విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటన రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది.

Exit mobile version