Site icon NTV Telugu

Shyamala: ‘బాబు గారి మాటలకు అర్థాలే వేరులే’.. కొత్త సినిమా విడుదలైంది అంటూ శ్యామల సెటైర్లు..

Ycp Shyamala

Ycp Shyamala

Shyamala: ఆంధ్రప్రదేశ్‌లో ‘బాబు గారి మాటలకు అర్థాలే వేరులే’ అనే కొత్త సినిమా విడుదలైంది అంటూ వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి శ్యామల సెటైర్లు వేశారు.. ఎన్నికల ముందు బాబు గారు ఒక మాట మాట్లాడారు అంటే చాలా అర్థాలు ఉంటాయి.. గత ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధిని నిర్వీర్యం చేశారు.. మద్యం మాఫియాతో అనాగరిక పాలన సాగుతోంది.. నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీలు అనేకం పుట్టుకొస్తున్నాయి.. రాష్ట్రంలో అర్ధరాత్రి సమయంలో కూడా మద్యం దొరుకుతుంది.. మద్యం అసలుదా.. నకిలీదా కూడా అర్ధం కావటం లేదు.. ఆర్గనైజ్డ్ గా ప్రజలను మోసం చేస్తున్నారు.. మద్యాన్ని కట్టడి చేసి ఉంటే కర్నూలు బస్సు ఘటన జరిగి ఉండేది కాదు.. అర్ధరాత్రి మద్యం దొరక్కపోతే అసలు ఘటన జరిగేది కాదు కదా.. అని వ్యాఖ్యానించారు..

Read Also: Fake Babas Gang: దుండిగల్‌లో దొంగ బాబాల ముఠా.. మత్తుమందు చల్లి రూ. 8.5 లక్షలు స్వాహా..!

హైవే పక్కన బెల్ట్ షాప్ నడపటానికి మీకు బాధ్యత లేదా ? అని మండిపడ్డారు శ్యామల.. మద్యం విచ్చలవిడిగా అమ్మటం వల్లే ఈ ఘటన జరగలేదా? అని ప్రశ్నించారు. రాత్రి 8 గంటలకు మద్యం తాగారు అని చెప్తున్నారు.. ఘటన జరిగింది 3 గంటలకు.. మరి అప్పటి వరకు ఏం జరిగిందో చెప్పాలి ? అని డిమాండ్‌ చేవారు.. లక్ష్మీపురం లో బెల్ట్ షాపులు లేవా ? అని నిలదీసిన ఆమె.. రాష్ట్రంలో బెల్ట్ షాపులు లక్షన్నరకు పైగా నడుస్తున్నాయి.. నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలు పోతున్నా ఎవరూ మాట్లాడటం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు.. టీడీపీ నేతలే నకిలీ మద్యాన్ని తయారు చేసి తమ బెల్ట్ షాపుల ద్వారా అమ్ముతున్నారని ఆరోపించారు.. ప్రభుత్వ ఖజానాకు వేల కోట్లు నష్టం కలిగిస్తున్నారు.. ఇన్ని తప్పులు జరుగుతున్నాయని తెలిసినా మేం క్లీన్ అని చెప్పుకోవటంలో చంద్రబాబు, లోకేష్ కు ఎవరూ సాటిరారు అంటూ ఎద్దేవా చేశారు.

Read Also: Taapsee Pannu : పెళ్లి తర్వాత కనిపించని తాప్సి పొన్ను.. ఇప్పుడేం చేస్తుంది

లిక్కర్ స్కాం అంటూ సిట్ వేశారు.. సిట్ అంటే సో ఇన్ టచ్ విత్ చంద్రబాబు అన్నట్లుగా పనిచేస్తుందని విమర్శించారు శ్యామల.. కల్తీ మద్యం ఫ్యాక్టరీల వ్యవహారంలో వాటాల మధ్య తేడాలు రావటం వల్లే బయటపడుతున్నాయన్న ఆమె.. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు కారణం మద్యం మాఫియానే అన్నారు.. జగన్ సంక్షేమ పాలన అందిస్తే కూటమి ప్రభుత్వం సంక్షోభ పాలన చేస్తుందని దుయ్యబట్టారు.. నకిలీ మద్యం గురించి చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లకు పట్టడం లేదని మండిపడ్డారు.. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కల్తీ మద్యం వద్దు మెడికల్ కళాశాలలు ముద్దు అంటున్నారు.. ప్రతీ 50 ఇళ్లకు ఒక బెల్ట్ షాపు, ప్రతీ రెండు వేల మందికి ఒక మద్యం షాపు పెట్టిన బాబు విజనరీ అంటూ ఎద్దేవా చేశారు.. ఇవాళ ప్రతీ వర్గం వైఎస్‌ జగన్ వైపు ఆశగా ఎదురుచూస్తున్నారని వ్యాఖ్యానించారు వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి శ్యామల..

Exit mobile version