YV Subba Reddy: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు సోషల్ మీడియా పోస్టులు కాకరేపుతున్నాయి.. ఇదే సమయంలో.. కేసులు, అరెస్ట్‌లు జరుగుతున్నాయి.. అయితే, అధికార కూటమి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి అరెస్ట్‌లు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.. ఈ ఘటనలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. అయితే, ప్రతి కార్యకర్తకు మేం అండగా నిలబడతాం అన్నారు.. ఇప్పటి వరకు రాష్ట్రంలో 57 మంది సోషల్ యాక్టివిస్టులపై అక్రమ కేసులు బనాయించారు.. 12 మంది కార్యకర్తల ఆచూకీ తెలియడం లేదన్నారు.. హైదరాబాద్‌లో ఉండే పెద్దిరెడ్డి సుధారాణి అనే మహిళను అరెస్టు చేయకుండా ఐదు రోజులపాటు అక్రమంగా నిర్బంధించారని మండిపడ్డారు.. మా ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలను నియోజకవర్గంలో తిరగకుండా ప్రయత్నాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ అంశాలన్నింటిని మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేశామని వెల్లడించారు.. మా కార్యకర్తలను హింసించి వారి నుంచి అనుకూల స్టేట్మెంట్లు తీసుకుంటున్నారు.. తక్షణమే ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కోరామని తెలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి..
Read Also: HAL Recruitment: డిప్లొమా అభ్యర్థులకు హెచ్‌ఏఎల్ ఉద్యోగాలు.. ఇరవై వేలకు పైగా జీతం