NTV Telugu Site icon

Amaravati: అమరావతి అభివృద్ధి.. ఈ ఏడాది చివరకల్లా రూ.15 వేల కోట్ల రుణం..

Amaravati

Amaravati

Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధాని “అమరావతి” అభివృద్ధికి ఈ ఏడాది చివరకల్లా రూ. 15 వేల కోట్లు రుణం ఇవ్వనున్నారు.. “ప్రపంచ బ్యాంకు”, “ఏసియా డెవలప్ మెంట్ బ్యాంకు” (ఏడీబీ)లు సంయుక్తంగా రూ. 15 వేల కోట్లు రుణం అందించనున్నాయి.. “అమరావతి” అభివృద్ధికి రుణ మంజూరుపై ఈ రోజు ఢిల్లీలో రెండు బ్యాంకుల ఉన్నతాధికారులతో ఏపీ ఉన్నతాధికారుల చర్చలు సుదీర్ఘంగా సాగాయి.. “హడ్కో” నుంచి రూ. 11 వేల కోట్లు, “ప్రపంచ బ్యాంకు”, “ఏసియా డెవలప్ మెంట్ బ్యాంకు” ల నుంచి మరో రూ.15 వేల కోట్ల రుణంతో “అమరావతి” అభివృద్ధి కోసం ఇవ్వనున్నారు..

Read Also: Zomato Food Rescue: కొత్త ఫీచర్‭తో సగం ధరకే ఫుడ్ అందించనున్న జొమాటో

భారత ప్రభుత్వం హామీతో “ఏడీబీ”, “ప్రపంచ బ్యాంక్”లు చెరో ఏడున్నర వేల కోట్ల రూపాయలు “అమరావతి” అభివృద్ధికి రుణ మంజూరు పై ఈ రోజు జరిగిన సమావేశంలో చర్చించారు.. రెండు బ్యాంకుల ఉన్నతాధికారులతో, కేంద్ర ఉన్నతాధికారులు, ఏపీ ఆర్దిక శాఖ కార్యదర్శి కే. సురేంద్ర, “సీఆర్డీఏ” కమిషనర్ కే. భాస్కర్, అమరావతి డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ లక్ష్మీ పార్ధసారథి ఈ రోజు సుదీర్ఘ చర్చలు జరిపారు.. ఢిల్లీలోని “ప్రపంచ బ్యాంక్” ప్రాంతీయ కార్యాలయంలో ఈ రోజు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం వరకు చర్చలు సాగాయి.. “ప్రపంచ బ్యాంకు”, “ఏసియా డెవలప్ మెంట్ బ్యాంకు” (ఏడీబీ) లకు చెందిన “బోర్డులు” డిసెంబర్‌ నెల రెండో వారంలో సమావేశమై రుణ మంజూరుపై అంతిమ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.. మొత్తంగా ఈ ఏడాది చివరికల్లా రెండు బ్యాంకులు 15 వేల కోట్ల రూపాయల రుణాన్ని ఏపీకి మంజూరు చేసే అవకాశాలున్నాయి.. అలాగే, “హడ్కో” నుంచి కూడా “అమరావతి” అభివృద్ధికి 11 వేల కోట్ల రూపాయల రుణాన్ని పొందనుంది ఏపీ ప్రభుత్వం. “హడ్కో” రుణ మంజూరుపై ఏపీ బడ్జెట్ సమావేశాల తర్వాత అంతిమ చర్చలు జరగనున్నాయి..

Show comments