Site icon NTV Telugu

Amaravati Capital: రాజధాని అమరావతి నిర్మాణానికి భారీ విరాళం

Amaravati Capital

Amaravati Capital

Amaravati Capital: రాజధాని అమరావతి పునర్‌నిర్మాణం వైపు వడివడిగా అడుగులు వేస్తోంది ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం.. ఇదే సమయంలో.. అమరావతి నిర్మాణానికి విరాళాలు కూడా స్వీకరిస్తున్నారు.. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఇందుపల్లికి చెందిన కోగంటి ఇందిరాదేవి కుమార్తె పి విజయలక్ష్మి రాష్ట్ర ప్రభుత్వానికి రూ. కోటి విరాళంగా అందించారు. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసిన ఆమె.. ఈ మేరకు కోటి రూపాయల చెక్కును అందజేశారు.. ప్రస్తుతం హైదారాబాద్‌ ఫిల్మ్‌నగర్‌లో నివాసం ఉంటున్న విజయలక్ష్మి.. అమరావతి నిర్మాణంలో తాము సైతం భాగస్వాములం కావాలనే ఉద్దేశంతో కోటి రూపాయలు విరాళంగా ఇచ్చినట్టు పేర్కొన్నారు.. తమ తల్లి ఇందిరాదేవికి ఆత్మశాంతి కలిగేలా ఆవిడ కోరిక నెరవేర్చేందుకు హైదరాబాద్‌లో తమకున్న కొద్ది స్థలాన్ని అమ్మి.. అమరావతి నిర్మాణానికి విరాళంగా ఇస్తున్నట్టువిజయలక్ష్మి ఈ సందర్భంగా వెల్లడించారు.. ఇక, విజయలక్ష్మి త్యాగనిరతిని ఈ సందర్భంగా అభినందించారు సీఎం చంద్రబాబు నాయుడు.. రాజధాని నిర్మాణం కోసం ఇచ్చిన విరాళం చిరస్థాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు ఏపీ ముఖ్యమంత్రి..

Read Also: Park Min Jae: షాకింగ్: యువ నటుడు హఠాన్మరణం

Exit mobile version