Amaravati Capital: రాజధాని అమరావతి నిర్మాణానికి భారీ విరాళం
- రాజధాని అమరావతి పునర్‌నిర్మాణం వైపు వడివడిగా అడుగులు..
- రాజధాని నిర్మాణానికి రూ. కోటి విరాళంగా ఇచ్చిన విజయలక్ష్మి అనే మహిళ..
- సీఎం చంద్రబాబును కలిసి చెక్ ను అందజేసిన మహిళ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amaravati Capital: రాజధాని అమరావతి పునర్‌నిర్మాణం వైపు వడివడిగా అడుగులు వేస్తోంది ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం.. ఇదే సమయంలో.. అమరావతి నిర్మాణానికి విరాళాలు కూడా స్వీకరిస్తున్నారు.. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఇందుపల్లికి చెందిన కోగంటి ఇందిరాదేవి కుమార్తె పి విజయలక్ష్మి రాష్ట్ర ప్రభుత్వానికి రూ. కోటి విరాళంగా అందించారు. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసిన ఆమె.. ఈ మేరకు కోటి రూపాయల చెక్కును అందజేశారు.. ప్రస్తుతం హైదారాబాద్ ఫిల్మ్‌నగర్‌లో నివాసం ఉంటున్న విజయలక్ష్మి.. అమరావతి నిర్మాణంలో తాము సైతం భాగస్వాములం కావాలనే ఉద్దేశంతో కోటి రూపాయలు విరాళంగా ఇచ్చినట్టు పేర్కొన్నారు.. తమ తల్లి ఇందిరాదేవికి ఆత్మశాంతి కలిగేలా ఆవిడ కోరిక నెరవేర్చేందుకు హైదరాబాద్‌లో తమకున్న కొద్ది స్థలాన్ని అమ్మి.. అమరావతి నిర్మాణానికి విరాళంగా ఇస్తున్నట్టువిజయలక్ష్మి ఈ సందర్భంగా వెల్లడించారు.. ఇక, విజయలక్ష్మి త్యాగనిరతిని ఈ సందర్భంగా అభినందించారు సీఎం చంద్రబాబు నాయుడు.. రాజధాని నిర్మాణం కోసం ఇచ్చిన విరాళం చిరస్థాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు ఏపీ ముఖ్యమంత్రి..
Read Also: Park Min Jae: షాకింగ్: యువ నటుడు హఠాన్మరణం
Also Read
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!