Site icon NTV Telugu

Nagababu: మెగా బ్రదర్ నాగబాబు పొలిటికల్ కెరీర్ ఎటు..?

Nagababu

Nagababu

Nagababu: మెగా బ్రదర్ నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటారని కొంతకాలంగా ఏపీ పాలిటిక్స్‌లో చర్చ జరిగింది. ఆ ఊహాగానం నిజమే అని స్వయంగా సీఎం చంద్రబాబు ఆ మధ్య క్లారిటీ ఇచ్చారు. దానికి సంబంధించి ఒక ప్రెస్ నోట్ కూడా ఇచ్చారు. ఇప్పటి వరకు రాజకీయ చరిత్రలో ఒక వ్యక్తిని మంత్రివర్గంలోకి తీసుకుంటామని సీఎం మీడియాకు నోట్ ఇచ్చిన సందర్భాలు బహుశా లేవేమో! ఒక్క నాగబాబు విషయంలోనే ఇలా జరిగింది. ఇలా ఇవ్వడం వెనక కొన్ని కారణాలు ఉన్నాయంటున్నారు. నిజానికి నాగేంద్రబాబును రాజ్యసభకు పంపాలని తమ్ముడు పవన్ కల్యాణ్ భావించారు. ఇదే అంశం ఢిల్లీ బీజేపీ నేతల నోటీస్‌కు తెచ్చారు. చంద్రబాబు దృష్టిలో కూడా పెట్టారు. కానీ ప్రత్యేక పరిస్థితిలో ఎంపీ సీటు నాగబాబుకు రాలేదు. లెక్కల్లో భాగంగా సానా సతీష్‌, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్యను రాజ్యసభకు తీసుకున్నారు.

Read Also: Device Tokenization Solution: ఫోన్ పే కొత్త ఫీచర్.. యూజర్లకు ఇక ఆ ఇబ్బందులుండవ్

దీంతో నాగబాబును అడ్జస్ట్‌మెంట్‌లో భాగంగా కేబినెట్‌లోకి తీసుకుంటామని మాటిచ్చారు. మార్చిలో జరగబోయే విస్తరణలో తీసుకోవచ్చనే చర్చ కూడా జరిగింది. అయితే సడెన్‌గా వైసీసీ ఎంపీ సాయిరెడ్డి రాజ్యసభకు రాజీనామా చేశారు. దీంతో రాజ్యసభ స్థానం ఒకటి ఖాళీ అయింది. దీనిని నాగబాబుకు ఇస్తారా అనే చర్చ కూడా జరుగుతోంది. త్వరలోనే ఈ స్థానాన్ని భర్తీ చేస్తారు. కొన్ని పేర్లు కూడా వినబడుతున్నాయి. ఎలాగూ నాగబాబు మొదట రాజ్యసభ అడిగారు కాబట్టి, ఈ సీటుని ఆయనకే ఇవ్వచ్చనే చర్చ కూడా జరుగుతోంది. పైగా కేబినెట్‌లో ఏడాది తిరగకుండా మార్పులు ఉండకపోవచ్చని కూడా చెబుతున్నారు. సో, ముందుగా అనుకున్నట్టు నాగబాబును రాజ్యసభకు పంపొచ్చనే ఊహాగానాలు కూటమిలో వినిపిస్తున్నాయి. పైగా కేబినెట్‌ షిఫిల్ చేయాలంటే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాలి. ఒక్క నాగబాబునే తీసుకోలేరని.. తీసుకుంటే మళ్లీ మార్పులు చేయాలనుకుంటే ఇబ్బందులు రావచ్చని అంటున్నారు. ఇదంతా ఎందుకని.. ప్రస్తుతం రాజ్యసభ ఖాళీని నాగబాబుతో భర్తీ చేసి, కేబినెట్‌లో మార్పులు తర్వాత చేసుకోవచ్చని కూటమి నేతలు అనుకుంటున్నారు.

Exit mobile version