మెగా బ్రదర్ నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటారని కొంతకాలంగా ఏపీ పాలిటిక్స్‌లో చర్చ జరిగింది. ఆ ఊహాగానం నిజమే అని స్వయంగా సీఎం చంద్రబాబు ఆ మధ్య క్లారిటీ ఇచ్చారు. దానికి సంబంధించి ఒక ప్రెస్ నోట్ కూడా ఇచ్చారు. ఇప్పటి వరకు రాజకీయ చరిత్రలో ఒక వ్యక్తిని మంత్రివర్గంలోకి తీసుకుంటామని సీఎం మీడియాకు నోట్ ఇచ్చిన సందర్భాలు బహుశా లేవేమో! ఒక్క నాగబాబు విషయంలోనే ఇలా జరిగింది.