NTV Telugu Site icon

CM Chandrababu: సోషల్ మీడియాపై స్పెషల్‌ ఫోకస్.. ప్రత్యేక విభాగం పెడతాం..

Cbn

Cbn

CM Chandrababu: సోషల్ మీడియా మీద ప్రత్యేకంగా ఫోకస్ పెడతాం అన్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఏపీ అసెంబ్లీలో శాంతిభద్రతలపై శ్వేతపత్రాన్ని విడుదల చేసిన ఆయన.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.. ఆడబిడ్డలను ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేస్తే ఏం చేయొచ్చో.. చేసి చూపిస్తాం అన్నారు.. సోషల్ మీడియా ట్రోలింగ్స్ కంట్రోల్ చేయడానికి ప్రత్యేక విభాగం పెడతామని ప్రకటించారు.. కక్ష సాధింపు ఆలోచన పక్కన పెట్టండి. బాధ్యతతో వ్యవహరించాలి.. ప్రజలకు సేవ చేయాలి అని సూచించారు చంద్రబాబు.. ఇక, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఓ రోజంతా శాంతి భద్రతలపై చర్చిద్దాం.. వివిధ వర్గాలు, ఉద్యోగులు, అమరావతి రైతులపై తప్పుడు కేసులు పెట్టారు. ఈ కేసులను ఏం చేయాలనే దానిపై సమీక్షిస్తాం. తప్పుడు కేసులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవడం ఖాయం అని స్పష్టం చేశారు చంద్రబాబు.

Read Also: Balakrishna: బాలయ్యా.. ఏందయ్యా ఈ జోరు.. కుర్ర హీరోలతో పోటీనా?

ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా ఎన్డీఏ ప్రభుత్వంలో ఏ ఒక్కరూ వ్యవహరించ వద్దు అని సూచించారు చంద్రబాబు.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దన్న ఆయన.. చాలా మందికి బాధ ఉంది.. ఆవేశం ఉంది.. నాయకులుగా మనమే కాదు.. కార్యకర్తల్లోనూ ఆవేదన ఉందని.. కానీ, కక్షసాధింపునకు ప్రజలు మనకు అధికారం ఇవ్వలేదన్నారు. ప్రాణ సమానమైన కార్యకర్తలను పోగొట్టుకున్నాను. నేను చంద్రయ్య పాడె మోశాను.. నేను ఎలా మరిచిపోగలను…? అని ప్రశ్నించారు. సినిమాల్లో నటించే పవన్ కల్యాణ్‌ కూడా రోడ్ మీద పడుకునేలా చేశారు. ఆడబిడ్డలకు రక్షణ కల్పించే బాధ్యత తీసుకోండని ఓ బాధితురాలు నన్ను కోరింది. మాకేం చేయొద్దు సార్.. మాకు రక్షణ కల్పిస్తే చాలు అని మాత్రమే కోరారని గుర్తుచేసుకున్నారు.. ఇక, ఫ్యామ్లీ విషయాలు కూడా ఇష్టానుసారంగా మాట్లాడారు. ఈ వ్యవహారంలో సోషల్ మీడియా మీద ప్రత్యేక ఫోకస్ పెడతాం అన్నారు.. ఆడబిడ్డలను ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేస్తే ఏం చేయొచ్చో.. చేసి చూపిస్తాం అని హెచ్చరించారు సీఎం చంద్రబాబు..

Read Also: Akash Puri: పేరు మార్చుకున్న ‘పూరీ’ కుమారుడు.. కారణం అదేనా?

ఈ శ్వేత పత్రం విడుదల చేసే సమయంలో జగన్ ఉండుంటే.. తానేం చేశానోనని ఓసారి ఆలోచన చేసేవాడేమో..? అన్నారు చంద్రబాబు.. గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున మహిళలు మిస్సయ్యారు. అబ్దుల్ సలాం కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకునేలా చేశారు. మైనార్టీ విద్యార్థినులు చదువుకునే హక్కును కూడా లాగేసుకున్నారు. మిస్బా అనే చిన్నారిని చనిపోయేలా చేశారు. అమరావతి మహిళా రైతుల బాత్రూంలపై డ్రోన్లు ఎగరేశారు. జగన్ సభలకు బ్లాక్ చున్నీలు కూడా ఉండకుండా చూసుకునేవారు. హెలీకాప్టరులో వెళ్తోన్నా పరదాలు కట్టారు.. చెట్లు కొట్టారు. దేవాలయాలపై దాడులు చేశారు.. దోపిడీలు చేశారు. స్ఖానిక సంస్థల్లో పోటీ చేయలేని పరిస్థితి సృష్టించారు అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.. ఎస్ఈసీగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు రక్షణ లేకుండా పోయింది. నిమ్మగడ్డ ఫ్యామ్లీకి రక్షణ కోసం కేంద్రాన్ని కోరాల్సిన పరిస్థితి కల్పించారు. హు కిల్డ్ బాబాయ్..? ఇప్పటికీ సమాధానం లేదు. వివేకా హత్యలో రకరకాల ట్విస్టులు ఇచ్చారు. తప్పును కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేశారు. సీబీఐ అధికారుల మీద కేసు పెట్టారు. అవినాష్ ను అరెస్ట్ చేయడానికి వచ్చిన సీబీఐకు నాటి రాష్ట్ర ప్రభుత్వం సహకరించ లేదు. కోడికత్తి డ్రామా, గులకరాయి డ్రామాలు ఆడారు. సానుభూతితో జగన్ గెలిచి ఉంటే.. ప్రజాస్వామ్యం రక్షణ లేకుండా పోయిందన్నారు సీఎం చంద్రబాబు నాయుడు..